స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 30) భారీ నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ సెన్సెక్స్ నేడు 983.58 పాయింట్లు(1.98 శాతం) నష్టపోయి 48782.36 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగం, ఫైనాన్షియల్ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే నిఫ్టీ 50 స్టాక్స్ సూచీ 263.80 పాయింట్లు లేదా 1.77 శాతం క్షీణించి 14631.10 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సూచీలు భారీగా పతనం కావడంతో నేడు ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2.02 లక్షల కోట్లు క్షీణించి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.209.05 కోట్ల నుండి రూ.207.03 కోట్లకు తగ్గింది.

అందుకే నష్టపోయిన సూచీలు
హెల్త్ మినిస్ట్రీ డేటా ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 386,452 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఒకరోజులో అత్యధిక కేసులు నమోదయింది ఇక్కడే. అలాగే, 3,498 మంది మృతి చెందారు. కరోనా కేసులు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలహీనపరిచింది. దీనికి తోడు వీకెండ్, కరోనా సెకండ్ వేవ్ భయాందోళనతో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో సూచీలు భారీగా నష్టపోయాయి.

27 స్టాక్స్ నష్టాల్లో
సెన్సెక్స్ 30లోని 27 స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇందులో HDFC ఏకంగా 4.38% పతనమైంది. ఆ తర్వాత HDFC బ్యాంకు (4.09%), ICICI బ్యాంకు (3.36%), కొటక్ మహీంద్రా బ్యాంకు (3.24%), ఏషియన్ పేయింట్స్ (2.81%) నష్టపోయాయి. అదే సమయంలో ONGC (4.32%), సన్ ఫార్మా (1.57%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(1.23) లాభపడ్డాయి.

మార్కెట్ క్యాప్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ.1264369.99 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ.1123919.77 కోట్లు), HDFC బ్యాంకు (రూ.778850.97 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.576867.96 కోట్లు), హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (రూ.553053.02 కోట్లు), HDFC (రూ.436582.10 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంకు (రూ.415348.35 కోట్లు), కొటక్ మహీంద్రా బ్యాంకు (రూ.346543.78 కోట్లు), బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ (రూ.328639.08 కోట్లు), ఎస్బీఐ (రూ.315440.39 కోట్లు)గా ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications