నిమిషాల్లో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఈ నెలలో రెండోసారి ట్రేడింగ్ నిలిపివేత
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 2600 పాయింట్ల నష్టంతో ప్రారంభమైం మధ్యాహ్నానికి 3500 పాయింట్లు దిగజారింది. నిఫ్టీ కూడా వెయ్యి పాయింట్లు దిగజారింది. ఓ దశలో సెన్సెక్స్ ట్రేడింగ్ 45 నిమిషాలు నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా కోలుకోలేదు. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. సెన్సెక్స్ 2600 పాయింట్లు కోల్పోయిన ప్రారంంభ 15 నిమిషాల్లోనే లక్షల కోట్లు ఆవిరైంది.

15 నిమిషాల్లో రూ.8 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2600 పాయింట్లు నష్టపోయిన సమయంలో మొదటి 15 నిమిషాల్లోనే ఇన్వెస్టర్లకు రూ.7.90 లక్షల కోట్లు ఆవిరయ్యాయి ఐసీఐసీఐ, అల్ట్రా టెక్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, మారుతీ వంటి టాప్ కంపెనీలు 10 శాతం మేర నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న ప్రభావం దేశీయ మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది.

ఆ తర్వాత నిమిషాల్లో రూ.10 లక్షల కోట్లు హాంఫట్
ఆ తర్వాత సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు నష్టపోయినప్పుడు ఏకంగా 10 లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు. సెన్సెక్స్ 10 శాతం నష్టపోవడంతో దీనిని నిలిపివేయడానికి ముందే పెద్ద మొత్తంలో కోల్పోయారు. పది గంటల సమయంలో ట్రేడింగ్ నిలిపివేశారు.

ట్రేడింగ్ నిలిపివేత ఈ నెలలో రెండోసారి
దేశీయ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపివేయడం ఈ నెలలో ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితం నిఫ్టీ 10 శాతం నష్టపోవడంతో 45 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇప్పుడు సెన్సెక్స్ నిలిపేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మార్కెట్లు పూర్తిగా క్లోజ్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications