స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. సోమవారం లాభపడిన సూచీలు, మంగళవారం నుండి నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ నాలుగు సెషన్‌లలో 60,765 పాయింట్ల నుండి 60,821 పాయింట్లకు పడిపోయింది. ఈ నాలుగు సెషన్‌లలో సెన్సెక్స్ 943 పాయింట్లు క్షీణించింది. కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువత్తిన కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో వరుసగా నాలుగో రోజు శుక్రవారం కూడా నష్టాలు తప్పలేదు. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు, దాదాపు మధ్యాహ్నం గం.12 వరకు అదే బాటలో పయనించాయి.
అక్కడి నుండి క్రమంగా క్షీణిస్తూ మధ్యాహ్నం గం.1 సమయానికి పూర్తి నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాల్ని నమోదు చేశాయి. తద్వారా ఆరంభ లాభాలు ఆవిరి అయ్యాయు. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడగా ఐరోపా మార్కెట్లు బలంగా ప్రారంభమయ్యాయి. కొన్ని రోజులుగా మార్కెట్ సూచీలు గరిష్ఠాల వద్ద నమోదవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ వారం కీలక రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. అందుకే మార్కెట్ వరుసగా నష్టపోతుందని చెబుతున్నారు.

943 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ నేడు 61,044.54 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,420.13 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,551.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,230.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,314.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,034.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 101.88 (0.17%) పాయింట్లు నష్టపోయి 60,821.62 పాయింట్ల వద్ద, నిఫ్టీ 63.20 (0.35%) పాయింట్లు క్షీణించి 18,114.90 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 62,245.43 పాయింట్లు కాగా, 52 వారాల కనిష్టం 39,241.87 పాయింట్లు. సెన్సెక్స్ ఈ వారం ప్రారంభంలో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో దాదాపు 1400 పాయింట్లు తగ్గింది. ఈ వారం మొదటి సెషన్‌లో 460 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, ఆ తర్వాత 943 పాయింట్లు నష్టపోయాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.85 వద్ద ముగిసింది.

దాదాపు రూ.9 లక్షల కోట్లు డౌన్
ప్రపంచంలోకెల్లా అత్యధిక వ్యాల్యూతో ట్రేడ్ అవుతున్న భారత మార్కెట్లో లాభాల స్వీకరణ కొనసాగడంతో సూచీలు వరుసగా నష్టపోతున్నాయి. నిన్న ఓ దశలో 800 పాయింట్ల వరకు పతనమై 60,500 స్థాయి దిగువకు పడిపోయింది. ముగింపులో కాస్త కోలుకున్నప్పటికీ, 336 పాయింట్ల నష్టంతో 60,923 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటి వరకు మూడు రోజుల్లో 842 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్, నేడు మరో 101.88 పాయింట్లు నష్టపోయింది.
నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. నిన్నటి వరకు మూడు రోజుల్లోనే వారి సంపద రూ.8.47 లక్షల కోట్ల మేర తగ్గింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.8,47,397 లక్షల కోట్లు తగ్గి, రూ.2,66,22,209 కోట్లగా నమోదయింది. నేడు మరింత క్షీణించింది. ఇటు దేశీయ మ్యూచువల్ ఫండ్స్, అటు విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా విక్రయిస్తుండటంతో, మార్కెట్ అధిక వ్యాల్యూకు చేరిందనే అభిప్రాయం వారిలో కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC 2.10 శాతం, బజాజ్ ఆటో 1.64 శాతం, ONGC 1.32 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.29 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.10 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 4.72 శాతం, కోల్ ఇండియా 3.56 శాతం, టాటా మోటార్స్ 3.37 శాతం, ITC 3.31 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 2.40 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications