స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ ఏకంగా 54,000 స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 16,200 దిగువన ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీగానే పతనమయ్యాయి. సెన్సెక్స్ గత నెల రోజుల్లో దాదాపు 4500 పాయింట్లు, గత ఐదు సెషన్‌లలో 2000 పాయింట్లకు పైగా క్షీణించింది. నెల రోజుల క్రితం 58,500 పాయింట్లకు పైగా ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 54,088 పాయింట్ల వద్ద ఉంది. దాదాపు అన్ని రంగాలకు చెందిన స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

నష్టాలకు కారణాలు
అమెరికా ద్రవ్యోల్భణ గణాంకాలు వెలువడడానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దేశీయ మార్కెట్ నుండి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. దీనికి తోడు ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రభావం చూపాయి. డాలర్ మారకంతో రూపాయి ఇటీవల భారీగా క్షీణించింది.
క్రితం సెషన్‌లో మాత్రం 10 పైసలు బలపడి 77.24 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ నష్టాలు ప్రభావం చూపాయి. మార్కెట్ నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.250 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది.

నాలుగు సెషన్‌లలో రూ.13 లక్షల కోట్లు
మార్కెట్ నిన్నటి వరకు వరుసగా నాలుగు సెషన్‌లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూ గత నాలుగు ట్రేడింగ్ సెషన్‌లలో రూ.13.32 లక్షల కోట్లు క్షీణించి రూ.246.31 లక్షల కోట్లకు తగ్గింది. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1613 పాయింట్లకు పైగా నష్టపోయింది. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 30 షేర్లలో మూడింట రెండొంతులు నష్టపోయాయి. బీఎస్ఈలో 2666 షేర్లు నష్టాల్లో, 730 షేర్లు లాభాల్లో ముగిశాయి. 118 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

నెల రోజుల్లో రూ.28 లక్షల కోట్లు
భారత స్టాక్ మార్కెట్ ఏప్రిల్ 11వ తేదీ నుండి ఎక్కువ సెషన్లు నష్టాల్లో ముగిశాయి. దీంతో గత నెల రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.28 లక్షల కోట్లకు తగ్గింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా గత నాలుగు నెలల్లో 2 ట్రిలియన్ డాలర్ల డాలర్ల మేర నష్టపోయాయి. మున్ముందు మరింత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications