Standard Capital Stock: దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీలో పెన్నీ స్టాక్స్ కూడా పాల్గొంటున్నాయి. పెద్ద కంపెనీలకు పోటీగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలో పెరుగుదలకు కారణంగా ఇన్వెస్టర్లు వాటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మెుగ్గుచూపటమే కారణంగా నిలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ పెన్నీ స్టాక్ గురించే. శుక్రవారం దేశీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ ఈ పెన్నీ స్టాక్ మాత్రం తుఫాను ర్యాలీని కొనసాగించింది. ఇంట్రాడేలో స్టాక్ ధర 4 శాతం పెరిగి రూ.1.98 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో షేరు ధర గరిష్ఠంగా రూ.1.99కి చేరింది. ఫిబ్రవరి నెలలో షేరు ధర రూ.3.52ని తాకింది. ప్రస్తుతం స్టాక్ కొనుగోలుకు ఇన్వెస్టర్లు మెుగ్గుచూపటంతో స్టాక్ రికవరీ మోడ్‌లో దూసుకుపోతోంది.

స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు తన రాబోయే సమావేశంలో దాని అర్హతగల వాటాదారుల కోసం ప్రత్యేక డివిడెండ్‌ను అందించటంపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనను కూడా సమావేశంలో పరిశీలించి ఆమోదించవచ్చని సమాచారం. ఇందుకోసం కంపెనీ బోర్డు ఏప్రిల్ 30న సమావేశం కానుంది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించే ప్రతిపాదనను పరిశీలిస్తారు.
తమ ఇన్వెస్టర్లు తిరుగులేని మద్దతు, నమ్మకాన్ని చూపించడానికి ఈ ప్రత్యేక డివిడెండ్ ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. షేర్ హోల్డర్ల దృఢ నిబద్ధత కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిందని వెల్లడించింది. సమావేశంలో ప్రిఫరెన్షియల్ ఇష్యూ/రైట్స్ ఇష్యూ/లేదా మరేదైనా మోడ్ ద్వారా నిధులను జారీ చేయడాన్ని కూడా డైరెక్టర్ల బోర్డు పరిశీలిస్తుందని స్టాండర్డ్ క్యాపిటల్ తన తాజా స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications