IPO News: టాటా ఐపీవో తొలిరోజే దిమ్మతిరిగే లాభాలు.. ఇన్వెస్టర్ల సంబరాలు..
Tata IPO: రెండు దశాబ్ధాల తర్వాత టాటాల నుంచి వచ్చిన ఐపీవో ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచేసింది. తొలిరోజే ఏకంగా ఇష్యూ ధర కంటే 140 శాతం లాభాలతో ప్రీమియం ధర వద్ద స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడింది.
టాటా టెక్నాలజీస్ ఐపీవో పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను తొలిరోజే అందించి లాభాల పంట పండించింది. చాలా కాలం ఎదురుచూపుల తర్వాత నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో షేర్ జాబితా అయ్యింది. స్టాక్ 140 శాతం అద్బుత ప్రీమియం రేటు రూ.1199.95 వద్ద BSEలో, రూ.1200 రేటు వద్ద ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. షేర్లు లిస్టింగ్ అయిన కొద్దిసేపటికే బీఎస్ఈలో స్టాక్ ధర ఇష్యూ రేటు కంటే దాదాపు 180% పెరిగి రూ.1,398కి చేరుకున్నాయి.

వాస్తవానికి టాటా టెక్నాలజీస్ ఐపీవో కోసం తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.475-500గా ప్రకటించింది. అయితే తొలిరోజు నుంచే ఇష్యూ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను పొందింది. దీంతో గ్రేమార్కెట్లో భారీగా ప్రీమియం కూడా పెరిగింది. అయితే నేడు మార్కెట్లో బలమైన లాభాలను పెట్టుబడిదారులకు అందించింది. ఇది 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాటా గ్రూప్ నుంచి వచ్చిన ఐపీవో కావటంతో అత్యధికంగా ఇన్వెస్టర్లను ఆకర్షించింది. దీనికి ముందు చివరిగా 2004లో టీసీఎస్ ఐపీవో టాటాల నుంచి వచ్చింది.
రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం ఐపీవో నవంబర్ 22న ప్రారంభమై నవంబర్ 24న ముగిసింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.3,042 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. టాటా టెక్ IPO 6.09 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ను కలిగి ఉంది. ఇందులో ప్రమోటర్ టాటా మోటార్స్ లిమిటెడ్ ద్వారా 46,275,000 షేర్లను, ఇన్వెస్టర్ ఆల్ఫా TC హోల్డింగ్స్ 9,716,853 షేర్లను, టాటా క్యాపిటల్ గ్రోత్ 4,858,425 షేర్లను విక్రయించాయి.


Click it and Unblock the Notifications