IPO News: కొత్తవారం ప్రారంభమౌతున్న 6 ఐపీవోలు.. పందెం వేసేందుకు గెట్ రెడీ..
Upcomig IPOs: జనవరిలో దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీవోల రాక కొంత మందగించింది. అయితే ఈవారం కొత్తగా వస్తున్న ఐపీవోలపై ఇన్వెస్టర్లు పందెం వేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
6 ఐపీవోలను ఫ్లోట్ చేయటం ద్వారా కంపెనీలు సంయుక్తంగా రూ.500 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వార్త వారికి అక్షరాలా శుభవార్తనే చెప్పుకోవాలి.

1- మెగాథెర్మ్ ఇండక్షన్ ఐపీవో
మార్కెట్లలో ఈ ఐపీవో జనవరి 29న ప్రారంభమవుతుంది. పెట్టుబడిదారులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కంపెనీ ఐపీవో పరిమాణం రూ.53.91 కోట్లుగా ఉంది. ఐపీవోకు ఒక్కో షేరు ధర రూ.100 నుంచి రూ.108గా ప్రైస్ బ్యాండ్ నిర్ణయించబడింది. ఐపీవోలో పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయిస్తోంది.
2- హర్షదీప్ హార్టికో ఐపీవో
ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జనవరి 29 నుంచి అందుబాటులోకి రాబోతోంది. సబ్ స్క్రిప్షన్ కోసం జనవరి 31 వరకు తెరచి ఉండనుంది. అయితే ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.19.09 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్న కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.42-45గా నిర్ణయించింది.
3- మయాంక్ క్యాటిల్ ఫుడ్ ఐపీవో
ఐపీవో ద్వారా రూ.19.44 కోట్లు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.108గా నిర్ణయించింది. ఇన్వెస్టర్ల కోసం ఐపీవో జనవరి 29 నుంచి జనవరి 31 వరకు తెరిచి ఉంటుంది.
4- బవేజా స్టూడియోస్ ఐపీవో
జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించే ఐపీవో ద్వారా రూ.97.20 కోట్లను సమీకరించాలని బవేజా స్టూడియోస్ నిర్ణయించింది. దీనిపై పందెం వేయాలనుకునే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే కంపెనీ తాజా ఐపీవోలో 40 లక్షల తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా.. మిగిలిన 14 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తోంది.
5- గాబ్రియేల్ పెట్ స్ట్రాప్స్ ఐపీవో
గాబ్రియేల్ కంపెనీ ఐపీవో జనవరి 31-ఫిబ్రవరి 2 మధ్య కాలంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరచి ఉంటుందని వెల్లడైంది. అయితే ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.8.06 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ మెుత్తాన్ని కంపెనీ 7.98 లక్షల తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మార్కెట్ల నుంచి సమీకరించాలని ప్రయత్నిస్తోంది.
6- బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ ఐపీవో
బీఎల్ఎస్ ఐపీవో జనవరి 30 నుంచి రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరుచుకుంటోంది. ఫిబ్రవరి 1న ముగియనుంది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.129-135గా నిర్ణయించింది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా రూ.310.91 కోట్లను రైజ్ చేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం ఏకంగా 2.3 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది.


Click it and Unblock the Notifications