IPO News: ముఖేష్ అంబానీ మెగా ఐపీవో ప్లాన్.. ఇన్వెస్టర్స్ డబ్బు రెడీ చేస్కోండి..!
Reliance Jio IPO: దేశంలో టెలికాం వ్యాపారంలో పెద్ద విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వ్యాపారి రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అంబానీ. ప్రజలకు వేగవంతమైన చవకైన ఇంటర్నెట్ సేవలను ఆయన పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రిలయన్స్ జియో తన టెలికాం టారిఫ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇప్పటికే దేశంలోని అనేక నగరాలకు తన 5జీ సేవలను విస్తరించిన జియో తన 5జీ వ్యాపారాన్ని మానిటైజ్ చేయాలని చూస్తోంది. వీటిని పరిశీలిస్తుంటే త్వరలోనే కంపెనీ తన ఐపీవో లాంచ్ కోసం సంసిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా నిలుస్తుందని వారు ఆసిస్తున్నారు.

అయితే నిపుణుల అంచనా ప్రకారం ఐపీవో రానున్న ఏడాది ప్రారంభంలో ఉండనుందని తెలుస్తోంది. జియో ఐపీవో గురించి మరింత సమాచారం దాని మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో వెల్లడించే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ ఏజీఎం వచ్చే నెల జరగనుండటంతో మార్కెట్లోని ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఐపీవో ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో ఆపీవోపై బెట్టింగ్ వేయాలని చూస్తున్నారు. గత ఏడాది రిలయన్స్ గ్రూప్ డీమెర్జర్ ద్వారా జియో ఫైనాన్షియల్ వ్యాపారాన్ని ఐపీవోగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇటీవలి టారిఫ్ పెంపు, 5G వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం రాబోయే త్రైమాసికాల్లో టెలికాం కంపెనీలకు కీలకమైన పనితీరు సూచిక అయిన ప్రతి వినియోగదారుల నుంచి జియోకు సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది వాటా విక్రయానికి ముందు సంభావ్య పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. ఇదే క్రమంలో బ్రోకరేజ్ సంస్థలు సైతం జియో టెలికాం వ్యాపార ఐపీవో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
రానున్న నెలలో జరిగే రిలయన్స్ ఏజీఎం నుంచి Jio లిస్టింగ్‌పై ఏవైనా అప్‌డేట్‌ల కోసం వెతుకుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది. ఈ క్రమంలో కంపెనీ విలువను రూ.11.11 లక్షల కోట్లుగా జెఫరీస్ అంచనా వేస్తోంది. ఈ వాల్యుయేషన్ ప్రకారం జియో ఐపీవో ఇప్పటి వరకు భారతదేశంలో అతిపెద్దదిగా మారవచ్చు. జియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 67.03 శాతం వాటా ఉంది. మిగిలిన 32.97 శాతంలో 17.72 శాతం గూగుల్, మెటా కలిగి ఉండగా.. విస్టా ఈక్విటీ పార్టనర్స్, పీఐఎఫ్, సిల్వర్ లేక్, కేకేఆర్, ఎల్ కాటర్టన్, జనరల్ అట్లాంటిక్, టీపీజీలు 15.25 శాతం వాటా కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications