IPO News: కొత్తవారంలో ఐపీవోల లాభాల కోలాహలం మళ్లీ తిరిగి వచ్చింది. బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ అయిన స్టాక్ ఇన్వెస్టర్లను సంతోషంలోకి నెట్టేసింది.
మనం మాట్లాడుకుంటున్నది ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన టెక్నోగ్రీన్ సొల్యూషన్ లిమిటెడ్ ఐపీవో షేర్ల గురించే. తొలిరేజే కంపెనీ షేర్లు బీఎస్ఈలో 1.2 శాతం ప్రీమియం ధర రూ.87 వద్ద జాబితా చేయబడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే 5 శాతం జంప్ చేసి రూ.91.35 రేటు వద్ద అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి. ఇది ఇన్వెస్టర్లకు లాభాల పంటను కురిపించింది.

ఈనెల 18న తెరచుకున్న టెక్నోగ్రీన్ ఐపీవో 21న సబ్‌స్క్రిప్షన్ ముగించింది. కంపెనీ షేర్ల కేటాయింపు 26 సెప్టెంబర్ 2023న జరిగింది. ఈ క్రమంలో ఒక్కో లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. అంటే రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనటానికి కనీసం రూ.1,37,600 పెట్టుబడి పెట్టారు. స్థిరమైన ధర కింద కంపెనీ రూ.16.72 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించేందుకు ఐపీవోను లాంచ్ చేసింది. ఈ క్రమంలో పూర్తిగా 19.44 లక్షల తాజా షేర్లను విక్రయించింది.
కంపెనీ BSE SME ఎక్స్ఛేంజీలో జాబితా చేయబడింది. IPO తర్వాత ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 89 శాతం నుంచి 65 శాతానికి తగ్గింది. టెక్నోగ్రీన్ సొల్యూషన్ లిమిటెడ్ IPO మూడవ రోజున 12.98 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. అలాగే మొదటి రోజున 0.85 రెట్లు, రెండవ రోజున 3.61 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసింది.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications