బడ్జెట్‌కు ముందు నష్టం 2 రోజుల్లో రికవరీ, రూ.10.48 లక్షల కోట్ల లాభం!
ముంబై: బడ్జెట్ నేపథ్యంలో గత రెండు సెషన్లలో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. బడ్జెట్‌కు ముందు 46,000 స్థాయిలో ఉన్న సెన్సెక్స్ నేడు 50,000 సమీపానికి వచ్చింది. అంతకుముందు 6 సెషన్లలో నష్టపోయిన సూచీలు ఈ రెండు రోజుల్లోనే ఆ స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.10.48 లక్షల కోట్లు ఎగిసింది. అంతకుముందు ఆరు సెషన్లలో రూ.11 లక్షల కోట్ల వరకు క్షీణించింది. నిన్న 2300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ నేడు 1200 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ నేడు 49,800 పాయింట్ల వరకు చేరుకోగా, నిఫ్టీ 14,600 పాయింట్లకు పైగా దాటింది.

6 సెషన్ల నష్టం రెండింట్లో రికవరీ
రెండు సెషన్లలో సెన్సెక్స్ 3,511 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 1,012 పాయింట్లు లాభపడింది. ప్రస్తుత సెషన్లో సెన్సెక్స్ 1197 పాయింట్లు, నిఫ్టీ 366 పాయింట్లు లాభపడింది. జనవరి 20వ తేదీ నుండి జనవరి 29వ తేదీ మధ్య సెన్సెక్స్ 3,506.35 పాయింట్లు లేదా 7.04 శాతం నష్టపోగా, అంతకుమించి సెన్సెక్స్ లాభపడింది. నిఫ్టీ బడ్జెట్‌కు ముందు అదే కాలంలో 1,010.10 పాయింట్లు లేదా 6.89 శాతం పడిపోయింది. ఈ రెండు రోజుల్లో నిఫ్టీ 1,012 పాయింట్లు ఎగిసింది.

మార్కెట్ క్యాప్
జనవరి 20వ తేదీన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.197.70 లక్షల కోట్లుగా ఉండగా, వరుసగా ఆరు సెషన్లలో భారీగా నష్టపోయి జనవరి 29వ తేదీ నాటికి రూ.186.12 లక్షల కోట్లకు పడిపోయింది. నేడు మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పుంజుకుంది. రూ.1,96,60,898.02 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్
టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ వరుసగా రిలయన్స్ రూ.1221261.56 కోట్లు, టీసీఎస్ రూ.1201888.82 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.859654.50 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.541308.64 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.524385.71 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.478428.11 కోట్లు, ఐసీఐసీఐ రూ.426189.09 కోట్లు, కొటక్ మహీంద్రా రూ.369157.36 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.327142.50 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.311712.40 కోట్లుగా నమోదయింది.


Click it and Unblock the Notifications