Bonus Shares: ఉచితంగా షేర్లు ఇస్తున్న 3 కంపెనీలు ఇవే.. మీ దగ్గర ఉన్నాయా..??
Bonus Stocks: ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు గడచిన ఆర్థిక సంవత్సరానికి నాలుగో త్రైమాసిక ఫలితాలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని తమ పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను కూడా అందిస్తున్నాయి.
రానున్న వారంలో మూడు కంపెనీలు తమ పెట్టుబడిదారులను బోనస్ షేర్లతో ఖుషీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఇన్వెస్టర్ల చూపు ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్, నాప్‌బుక్స్, శుక్ర ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీల షేర్లపైనే ప్రధానంగా ఉన్నాయి. ముందుగా ఈ శుక్ర ఫార్మాస్యూటికల్స్ కంపెనీ 3:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించాలని నిర్ణయించింది. అర్హులైన ఇన్వెస్టర్ల ఎంపికకోసం రికార్డు తేదీని కంపెనీ ఏప్రిల్ 20గా నిర్ణయించింది. చివరిగా ఏప్రిల్ 12న కంపెనీ ఒక్కో షేరు ధర రూ.326గా ఉంది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు 497.07 శాతం రాబడిని అందించాయి.

ఇదే క్రమంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల పంపిణీని ప్రకటించింది. ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీ వ్యాపారంలో ఉన్న కంపెనీ షేర్లకు అర్హులైన వాటాదారులందరికీ ఉచితంగా షేర్లను అందించాలని బోర్డు నిర్ణయించింది. అర్హతను నిర్ధారించడానికి ఏప్రిల్ 16ను కంపెనీ రికార్డు తేదీగా నిర్ణయించింది.
రికార్డ్ తేదీలో గుర్తించబడిన షేర్‌హోల్డర్‌లకు ప్రస్తుతం ఉన్న ప్రతి 1 ఈక్విటీ షేరుకు గాను కంపెనీ 1 బోనస్ షేర్ అందించనుంది. బీఎస్ఈలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఒక్కోటి ప్రస్తుతం రూ.628 వద్ద కొనసాగుతోంది. ఇంటిగ్రేటెడ్ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.677 ఉండగా.. 52 వారాల కనిష్ట స్థాయి రూ.54.46 కంటే ప్రస్తుతం కంపెనీ స్టాక్ 1053.14% భారీ లాభంతో ట్రేడవుతున్నాయి.
ఇక చివరిగా పెట్టుబడిదారులకు సంతోషాన్ని అందించిన షేర్లలో నాప్‌బుక్స్ స్టాక్ నిలిచింది. కంప్యూటర్ & సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్ సంస్థ న్యాప్‌బుక్స్ 2024 ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రికార్డు తేదీని నిర్ణయించి. ఈ క్రమంలో కంపెనీ 2:1 నిష్పత్తిలో అర్హులైన పెట్టుబడిదారులందరికీ షేర్ల పంపిణీ చేయాలని చూస్తోంది. నాప్‌బుక్స్ కూడా 52 వారాల గరిష్ట స్థాయి రూ.272కి చేరువలో ఉంది. ప్రస్తుతం స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.71 కంటే 277.04% ఎక్కువగా ట్రేడవుతోంది. నాప్‌బుక్స్ ఒక ఫిన్‌టెక్ కంపెనీ.


Click it and Unblock the Notifications