Wipro: ఇండియన్ టాప్ ఐటీ దిగ్గజం విప్రో షేర్ బైబ్యాక్ జూన్ 22న ప్రారంభం కానుంది. ఇది జూన్ 29, 2023 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లను కంపెనీకి తిరిగి విక్రయించటం ద్వారా మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంది.
బైబ్యాక్ కింద విప్రో మెుత్తం రూ.12,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం విప్రో షేర్ ధర దాదాపు రూ.385 స్థాయిలో ట్రేడవుతోంది. ఇదే క్రమంలో బైబ్యాక్ స్కీమ్ కింద విప్రో ఒక్కో షేరును రూ.445 రేటుకు తిరిగి కొనుగోలు చేస్తోంది. అంటే మనదగ్గర ఉన్న షేర్లను కంపెనీకి అమ్మేయటం ద్వారా ఒక్కో షేరుపై రూ.60 లాభంగా ఇన్వెస్టర్లు పొందవచ్చు.

విప్రో జారీ చేసిన లెటర్ ఆఫ్ ఆఫర్‌లో రిటైల్ అర్హత నిష్పత్తి 23.4 శాతంగా నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇతర పెట్టుబడిదారులకు 4.3 శాతంగా నిర్ణయించింది. రూ.2 లక్షల కంటే తక్కువ విలువైన షేర్లను కలిగి ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లు జూన్ 16న రికార్డు తేదీ నాటికి ప్రతి 265 షేర్లకు 62 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విప్రో తెలియజేసింది. మిగిలిన పెట్టుబడిదారులు ప్రతి 603 షేర్లకు 26 షేర్లను బైబ్యాక్ కోసం ఇవ్వవచ్చు.

విప్రో నిర్వహిస్తున్న బైబ్యాక్ వల్ల కంపెనీ షేర్ల రేటింగ్‌ను మెరుగుపరుస్తుంది. ఇది ప్రతి షేరుకు ఆదాయాలు, ఈక్విటీపై రాబడి వంటి నిష్పత్తులను మెరుగుపరుస్తుంది. బైబ్యాక్ తర్వాత కంపెనీ EPS రూ. 20.73 నుంచి రూ. 21.79కి పెరుగుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications