SJVN Shares: దేశంలో ప్రస్తుతం మంచి ర్యాలీని చూస్తున్నవాటిలో పవర్ రంగానికి చెందిన షేర్లు కూడా ఉన్నాయి. ఈ రంగంలోని అనేక కంపెనీలపై రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ లాంటి సంస్థలు సైతం పందెం వేయటం మార్కెట్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎస్జేవీఎన్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. కంపెనీ షేర్లు గురువారం 6.1 శాతానికి పైగా పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.151.60కి చేరాయి. అయితే అనూహ్యంగా షేర్లలో పెరుగుదలకు పెద్ద కారణమే ఉంది. నిజానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) జూన్ త్రైమాసికంలో SJVNలో తన వాటాను 2.26%కి పెంచుకోవటం ప్రధాన కారణంగా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ కంపెనీలో 1.73 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. SJVN లిమిటెడ్‌లో రిటైల్ వాటాదారుల సంఖ్య కేవలం మూడు నెలల్లో 12 లక్షలకు పెరిగినట్లు తాజా డేటా వెల్లడిస్తోంది.

ఇదే క్రమంలో కంపెనీలో భారతీయ మ్యూచువల్ ఫండ్స్ కూడా తమ వాటాను పెంచుకున్నాయి. జూన్ త్రైమాసికం ముగింపులో మ్యూచువల్ ఫండ్స్ SJVNలో 1.56% వాటాను కలిగి ఉన్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 1.54% వాటాను మాత్రమే అవి హోల్డ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో కంపెనీలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల వాటా దాదాపు స్థిరంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ 81.85% వాటాతో పవర్ కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా ఉంది.
ఒకసారి టెక్నికల్స్ పరిశీలిస్తే.. స్టాక్ 61.7 వద్ద రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI)తో 'ఓవర్‌బాట్' లేదా 'ఓవర్‌సోల్డ్' జోన్‌లో ట్రేడ్ అవుతోంది. RSI 70 కంటే ఎక్కువ ఉంటే, స్టాక్ 'ఓవర్‌బాట్' భూభాగంలో ఉందని సూచిస్తుంది. స్టాక్ ఒక-సంవత్సర బీటా 1.6గా ఉంది. అదే కాలంలో చాలా ఎక్కువ అస్థిరతను సూచిస్తుంది. కౌంటర్ 5-రోజులు, 20-రోజులు, 50-రోజులు, 100-రోజులు, 150-రోజులు, 200-రోజుల సాధారణ చలన సగటు (SMA) కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. 2024లో ఇప్పటివరకు SJVN లిమిటెడ్ షేర్లు దాదాపు 64% పెరిగాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications