మార్కెట్లు ఈ వారంలో మొదటి రెండు రోజులు నష్టాలను మూటగట్టుకున్నాయి. సోమవారం అయితే సెన్సెక్స్ ఏకంగా 2వేల పాయింట్లకు పైగా నష్టపోయింది. గత రెండు సెషన్లలో బీఎస్ఈ ఇన్వెస్టర్ల సంపద రూ.6.98 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ రూ.122.343 లక్షల కోట్లకు తగ్గింది.

70 స్టాక్స్ 50% కంటే ఎక్కువ నష్టపోయాయి
కరోనా కారణంగా జనవరి నుండి BSE500లోని 70 స్టాక్స్ దాదాపు 50 శాతం మేర పడిపోయాయి. కొన్ని స్టాక్స్ 80 శాతం వరకు కూడా పడిపోయాయి. ఇందులో కెరా బ్యాంకు, డిష్ టీవీ, డెల్టా కార్పోరేషన్, ఫ్యూచర్ రిటైల్, గాయత్రి ప్రాజెక్టు, ఆర్బీఎల్ బ్యాంకు, రెప్కో హోమ్ ఫైనాన్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్ తదితరాలు ఉన్నాయి.

డైలమాలో మార్కెట్లు
కరోనా మహమ్మారి, దేశవ్యాప్తంగా లాక్ డౌన్, అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు గత రెండు రోజులుగా భారీ నష్టాలను చూశాయి. మొన్న భారీ నష్టాలను చూసిన మార్కెట్లు, నిన్న స్వల్పంగా నష్టపోయాయి. ఈ రోజు నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. మార్కెట్ డైలమాలోనే ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

రూపాయి బలహీనం
అమెరికా డాలర్ మారకంతో రూపాయి ఈ రోజు (బుధవారం ఏప్రిల్ 6) బలహీనపడింది. 18 పైసలు బలహీనపడి 75.81 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఓవర్సీస్‌లో అమెరికా కరెన్సీ బలపడటం, విదేశీ నిధుల ప్రవాహం ఔట్ ఫ్లో వంటి పలు కారణాలు రూపాయిపై ప్రభావం చూపాయి. మంగళవారం రూపాయి కాస్త బలపడి 75.63 వద్ద ముగిసింది. ఈ రోజు మళ్లీ బలహీనపడింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications