బడ్జెట్ ఎఫెక్ట్, రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం అదరగొట్టాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో సూచీలు భారీగా లాభపడ్డాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ ప్రకటన సమయంలో, ఆ తర్వాత మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్లు లేదా 5 శాతం లాభపడి 48,600.61 వద్ద, నిఫ్టీ 646.60 పాయింట్లు లేదా 4.74 శాతం ఎగిసి 14,281.20 పాయింట్ల వద్ద ముగిసింది.
క్రితం సెషన్లో 46,285 వద్ద ముగిసింది సెన్సెక్స్. నేడు 46,617.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,764.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది, 46,433.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేటి మోస్ట్ యాక్టివ్ జాబితాలో టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, రిలయన్స్ ఉన్నాయి. రిలయన్స్ రూ.1895 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో
ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, లార్సన్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్ ఉన్నాయి.

నేడు సూచీలు భారీగా ఎగిసిపడటంతో ఇన్వెస్టర్ల సంపద అమాంతం పెరిగింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు నిర్మలమ్మ ముహూర్తం ఖరారు చేయడంతో బ్యాంకింగ్ స్టాక్స్ అండతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో చూడని ఒక్కరోజు లాభాలన చూశాయి. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.34 లక్షల కోట్లు ఎగిసింది.7 ఏప్రిల్ తర్వాత అత్యధిక ఒకరోజు లాభం ఇదే.


Click it and Unblock the Notifications