కరోనా మహమ్మారి కారణంగా కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ నేపథ్యంలోను గత మూడు సెషన్లలో మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. మంగళవారం (మే 19) పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం పదకొండు గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 700పాయింట్ల వరకు ఎగిసింది. కానీ కరోనా కేసులు పెరగడం, ప్యాకేజీ మెప్పించకపోవడంతో గురు, శుక్ర, సోమవారాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, వాహన షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి.

రూ.3.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తగ్గింది
గత మూడు సెషన్‌లలో ఇన్వెస్టర్లు సంపదను పెద్ద మొత్తంలో కోల్పోయారు. సోమవారం స్టాక్ మార్కెట్లు దాదాపు ఆరు వారాల కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.65 లక్షల కోట్లు తగ్గి రూ.119 లక్షల కోట్లకు పరిమితమైంది. నిన్న డాలర్ మారకంతో రూపాయి 33 పైసలు తగ్గి 75.91 వద్ద క్లోజ్ అయింది.

లాభాల్లో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు
నిన్నటి వరకు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా మెరుగ్గా ఉన్నాయి. కానీ ప్యాకేజీ మెప్పించక పోవడం, కరోనా కేసులు పెరగడంతో మన మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లు నిన్నటి వరకు లాభాల్లో ఉండటం వంటి వివిధ కారణాలతో నేడు లాభాల్లోకి వచ్చాయి.

ప్యాకేజీ ప్రభావం ఇలా..
రక్షణ రంగంలో FDI పరిమితిని 74 శాతానికి పెంచడంతో నిన్న ఇంట్రాడేలో ఈ రంగంలోని షేర్లు లాభపడ్డాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్, అస్త్రా మైక్రోవేవ్, భారత్ ఎలక్ట్రానిక్స్, భాత్ డైనమిక్స్ వంటి షేర్లు లాభపడ్డాయి. ప్రారంభంలో భారీగా లాభపడినప్పటికీ, ఆ తర్వాత స్వల్ప లాభాలతో ముగిశాయి.
ఇక బ్యాంకుల ఎన్బీఏలు పెరగవచ్చుననే ఆందోళనతో బ్యాంకింగ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. వివిధ రంగాల బ్యాంకుల షేర్లు 5 శాతం నుండి 9 శాతానికి పైగా నష్టపోయాయి.
లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో మల్టీప్లెక్స్, హోటల్, విమాన షేర్లు నష్టపోయాయి. ఐనాక్స్, పీవీఆర్, ఇండియన్ హోటల్స్, విమానరంగ షేర్లు దాదాపు 5 శాతం నుండి 15 శాతం వరకు నష్టపోయాయి.

ఏడాది కనిష్టానికి షేర్లు..
నిన్నటి వరకు దాదాపు 140 షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి.
300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్స్‌ను తాకాయి.
కోల్ మైనింగ్‌లో ప్రయివేటు కంపెనీలకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించడంతో కోల్ ఇండియా షేర్ 6 శాతం న,్టపోయింది.
జియో ప్లాట్‌ప్లామ్స్‌లో జనరిక్ అట్లాంటిక్ పెట్టుబడులు పెట్టడంతో రిలయన్స్ షేర్లు నిన్న లాభపడ్డాయి.

ప్యాకేజీ సహా వివిధ కారణాల వల్ల నష్టాలు
రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఆకర్షితంగా లేదని చెబుతున్నారు. అందుకే మార్కెట్ సెంటిమెంటుకు బలం చేకూర్చలేకపోయాయని చెబుతున్నారు.
మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు మరో కారణం. వెసులుబాట్లు ఇచ్చినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు మరింతగా కోలుకోవడానికి జాప్యం అవుతుందని భావించాయి.
కరోనా కేసులు పెరుగుతుండటం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది.
డాలర్ మారకంతో రూపాయి 33 పైసలు క్షీించి 75.91కి పడిపోయింది.

ఈ రోజు ఎందుకు పుంజుకున్నాయి?
వివిధ కారణాలతో నిన్నటి వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు మంగళవారం మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఇందుకు ఓ కారణం అంతర్జాతీయ మార్కెట్లు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై జరిపిన తొలి దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అమెరికా కంపెనీ ప్రకటించింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని ఫెడ్ అభయం ఇచ్చింది. దీంతో సోమవారం అమెరికా స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. యూరప్ మార్కెట్లు 4 శాతం నుండి 6 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.
More From GoodReturns

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications