Samhi Hotels IPO: ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఐపీవోల ప్రవాహంలో చాలా మంది పెట్టుబడిదారులు వివరాలు తెలుసుకోకుండానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే నేడు ప్రారంభం అవుతున్న సంహి హోటల్స్ ఐపీవోలో ప్రఖ్యాత మధు కేల పెట్టుబడి పెడుతున్నారని చాలా మందికి తెలియదు.
2017 వరకు రిలయన్స్ క్యాపిటల్‌లో పనిచేసిన ఆయన సీజనల్ ఇన్వెస్టర్ అని చాలా మందికి తెలుసు. ఈ క్రమంలో సెప్టెంబర్ 14న ప్రారంభం అవుతున్న సంహి హోటల్స్ ఐపీవోలో ప్రమోటర్ అయిన బ్లూ చంద్ర నుంచి ఒక్కో షేరును రూ.126 చొప్పున ప్రీ-ఆఫర్‌లో రూ.30 కోట్ల విలువైన 28.3 లక్షల షేర్లను భార్య మాధురి పేరుపై కొనుగోలు చేశారు. సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ బ్లూ చంద్ర బ్రాండెడ్ హోటల్ యాజమాన్యం, అసెట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉంది.

ఇక ఐపీవో విషయానికి వస్తే కంపెనీ తాజా ఐపీవో ఫ్లోటింగ్ ద్వారా రూ.1,370.1 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. సాధారణ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే సెప్టెంబర్ 13న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.616 కోట్లను సమీకరించింది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ పరిశీలిస్తే ఒక్కో షేరుకు 119-126గా కంపెనీ ధరను ప్రకటించింది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించిన 13 ఏళ్లకు తన ఐపీవోను ప్రకటించింది.
ఈ క్రమంలో గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు రూ.35 ప్రీమియం ధరను కలిగి ఉన్నాయి. ఐపీవోలో పాల్గొనాలనుకుంటున్న ఇన్వెస్టర్ల కోసం ఒక్కో లాట్ లో 119 షేర్లను కంపెనీ విక్రయిస్తోంది. అంటే కనీసం రూ.14,994 వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐపీవోలో పాల్గొన్న వారికి సెప్టెంబర్ 22న షేర్ల ఎలకేషన్, సెప్టెంబర్ 27న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications