Rekha Jhunjhunwala: ఆ 5 కంపెనీల్లో షేర్లు అమ్మిన రేఖా జున్‌జున్‌వాలా.. టాటా స్టాక్స్ కూడా..
Jhunjhunwala Portfolio: దేశంలోని ప్రముఖ పెట్టుబడిదారుల్లో ఒకరిగా రేఖా జున్‌జున్‌వాలా కొనసాగుతున్నారు. బిగ్‌బుల్ మరణం తర్వాత చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్లో ఆమె పోర్ట్‌ఫోలియోను ట్రాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె చాలా మల్టీబ్యాగర్ కంపెనీల్లో వాటాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమ చేపట్టిన 5 కంపెనీల్లో వాటాల విక్రయం వెలుగులోకి వచ్చింది.
రేఖా వాటాలు తగ్గించుకున్న 5 కంపెనీల వివరాలివే..
డిసెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా కమ్యూనికేషన్స్‌లో రేఖా జున్‌జున్‌వాలాకు 1.8 శాతం వాటా ఉంది. అయితే మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 1.6 శాతానికి తగ్గించబడింది. దీనికి తోడు ఆమె పోర్ట్‌ఫోలియో తాజా వివరాల ప్రకారం.. రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్, కెనరా బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఎన్‌సీసీలో వాటాలను తగ్గించుకున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ఆమె కేఎం షుగర్ మిల్స్ కంపెనీలో కొత్తగా వాటాలను కొనుగోలు చేశారు.

ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం.. రాఘవ్ ప్రొడక్టివిటీలో రేఖా జున్‌జున్‌వాలా వాటా ఇప్పుడు 0.1 శాతానికి తగ్గిందని వెల్లడైంది. ఇదే క్రమంలో ఆమె కెనరా బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, NCC కంపెనీల్లో 0.6 శాతం వాటాను విక్రయించారు. 2024లో సిలికా ర్యామింగ్ మాస్‌ను తయారు చేసే రాఘవ్ ప్రొడక్టివిటీ కంపెనీ షేర్లు 15 శాతం పడిపోయాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌కు దూరంగా ఉండడం ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి కెనరా బ్యాంక్ నిరంతరం మంచి రాబడులను ఇస్తోంది. గత 12 నెలల్లో 100 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే రేఖా జున్‌జున్‌వాలాకు ప్రస్తుతం NCCలో 12.5 శాతం, ఫోర్టిస్‌లో 4.1 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నట్లు వెల్లడైంది.
రేఖా జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోకు సంబంధించిన ఈ సమాచారం మార్చి త్రైమాసిక ఫలితాల ఫలితాలకు ముందు వచ్చింది. మరికొన్ని రోజుల్లో దేశంలోని అనేక ఇతర కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించటానికి సిద్ధం అవుతున్నాయి. ఆమెకు ప్రస్తుతం దాదాపు 26 కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆమె నికర విలువ రూ.50,230 కోట్లుగా ఉంది. ఆమెకు టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, టైటాన్, నజారా టెక్, డెల్టా కార్ప్ వంటి పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications