Super Stock: లక్ష పెట్టుబడిని రూ.కోటి చేసిన స్టాక్.. ఆ ప్రముఖ ఇన్వెస్టర్ షేర్లు కలిగి ఉన్నారు..!!
Investment Ideas: ఒకపక్క మార్కెట్ల క్రాష్ కొనసాగుతున్నప్పటికీ మరో పక్క మాత్రం మల్టీబ్యాగర్ షేర్ల హవా కొనసాగుతూనే ఉంది. తమకు మార్కెట్లతో సంబంధం లేదు అన్నట్లుగా ఈ సూపర్ మల్టీబ్యాగర్లు పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి.
ఎక్స్‌ప్రో ఇండియా స్టాక్ తన పెట్టుబడిదారులకు నిరంతరం అద్భుతమైన రాబడిని అందిస్తూనే ఉంది. గత మూడేళ్లలో కంపెనీ షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో స్టాక్ ధర రూ.48.70 స్థాయి నుంచి రూ.1,077కి పెరిగింది. అంటే ఈ కాలంలో ఏకంగా 2111 శాతం రాబడిని ఇచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత నాలుగేళ్లలోనే కంపెనీ షేర్ ధర ఏకంగా రూ.10.5 నుంచి 10000 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

దీర్ఘకాలం పెట్టుబడిదారులకు అందిన లాభాలను పరిశీలిస్తే.. ఎవరైనా ఇన్వెస్టర్ నాలుగేళ్ల క్రితం ఎక్స్‌ప్రో ఇండియా స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి.. దానిని ఇప్పటి వరకు కొనసాగించినట్లయితే.. అతని సంపద రూ.1.02 కోట్లకు పెరిగి ఉండేది. ఫిబ్రవరి 27న కంపెనీ షేర్ ధర ఒక్కొక్కటి రూ.1,297 వద్ద ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కంపెనీ ప్రత్యేకంగా భారతదేశంలోని పాలిమర్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తుంది. కంపెనీ Biax, Coex, Thermoset అనే మూడు విభాగాల్లో పనిచేస్తోంది.
ఈ కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియాకు కూడా వాటాలను కలిగి ఉన్నారు. భారత స్టాక్ మార్కెట్‌లోని 'బిగ్ వేల్' ఆశిష్ కచోలియా ఫిబ్రవరి 2024 వరకు కంపెనీలో 3.67% వాటాను కలిగి ఉన్నట్లు ట్రెండ్‌లైన్ డేటా ద్వారా వెల్లడైంది. డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పనితీరులో ఆరోగ్యకరమైన మెరుగుదల కనిపించింది. Q3FY23లో రూ.93.1 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి 3.22% వృద్ధి చెంది రూ.96.1 కోట్లకు చేరుకుంది. అలాగే నికర లాభం Q3 FY23లో రూ.6.5 కోట్లతో పోలిస్తే Q3FY24లో రూ.10.07 కోట్లకు 55 శాతం వృద్ధిని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications