మమతా బెనర్జీని కలిసిన గౌతమ్ అదానీ తనయుడు, ఎందుకంటే?

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ గురువారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. పశ్చిమ బెంగాల్‌లో పెట్టుబడుల సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. మమతను రాష్ట్ర సచివాలయంలో కలిసినట్లు ఈ మేరకు పశ్చిమ బెంగాల్ టాప్ గవర్నమెంట్ అధికారి వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి.

రాష్ట్ర ప్రభుత్వం వార్షిక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు రెండు నెలల ముందు ఈ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో తాజ్ పూర్‌లో ప్రతిపాదిత డిప్ సీ పోర్ట్ నిర్మాణం పైన చర్చలు జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం కరణ్ అదానీ.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. అతను బెంగాల్‌లో పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు.

Investments in West Bengal: Gautam Adanis son meets CM Mamata Banerjee

సమావేశం సందర్భంగా డోయేచా-పచామ్ కోల్ మైనింగ్ ప్రాజెక్టులో పెట్టుబడులకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చించారని చెబుతున్నారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ హెచ్‌కే ద్వివేదీ తదితరులు ఉన్నారు. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం తాజ్ పూర్ డీప్ సీ పోర్ట్‌కు టెండర్ విడుదల చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు ఉంది.

ఇప్పటి వరకు తాజ్‌పూర్ డీప్ సీ పోర్ట్‌కు సంబంధించి పది కంపెనీలు ఆసక్తిని కనబరిచాయని, టెండర్లు సమర్పించాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, గౌతమ్ అదానీ కూడా డిసెంబర్ నెలలో మమతా బెనర్జీని సచివాలయంలో కలిసి, వివిధ పెట్టుబడులపై చర్చించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+