Startup: స్టార్టప్‌ల్లో తగ్గుతున్న పెట్టుబడులు.. ఎందుకంటే..
భారతీయ స్టార్టప్‌లు 2023 మొదటి అర్ధ భాగంలో (జనవరి నుంచి జూన్ వరకు) $3.8 బిలియన్లు సేకరించాయి. 2022 H1లో నిధుల సేకరణతో పోలిస్తే 36% తగ్గింది. ఇది గత నాలుగు సంవత్సరాలలో అత్యల్పం. PwC ఇండియా పరిశోధన నివేదిక ప్రకారం Fintech, SAAS, D2Cలు H12023లో అత్యధిక నిధులు సమకూర్చిన రంగాలుగా ఉన్నాయి.
"ఒక స్టార్టప్ ప్రయాణంలో ఫండింగ్ వచ్చేది కేవలం ఒక సీజన్ మాత్రమే. వెంచర్ క్యాపిటలిస్ట్‌ల (VCలు) వద్ద గణనీయమైన ఉపయోగించని మూలధన నిల్వలు ఉన్నప్పటికీ స్టార్టప్ ఫండింగ్‌లో తగ్గుదల ఉంది. భారతదేశంలోని క్రియాశీల VC సంస్థలు గత సంవత్సరంలో కొత్త నిధులను పొందాయి. రాబోయే కొద్ది నెలల్లో పెట్టుబడుల వేగం పుంజుకోవచ్చని మేము ఆశించవచ్చు" అని పార్ట్‌నర్ - డీల్స్ & ఇండియా స్టార్టప్‌ల లీడర్, PwC ఇండియా, అమిత్ నవ్కా అన్నారు.

ఈ మధ్యకాలంలో, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ముందు స్టార్టప్ గురించి వివరంగా తెలుసుకుంటున్నారని చెప్పారు. స్టార్టప్‌లు పటిష్టమైన కార్పొరేట్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉంటేనే పెట్టుబడిల పెడుతున్నట్లు తెలిపారు. SaaS, D2C, FinTech, e-commerce B2B, Logi, AutoTech సంవత్సరం మొదటి అర్ధభాగంలో అందుకున్న నిధుల ఆధారంగా మొదటి ఐదు పెట్టుబడి రంగాలలో కొనసాగుతున్నాయి.
H1 CY23లో మొత్తం స్టార్టప్ ఫండింగ్ యాక్టివిటీలో దాదాపు 83% స్టార్టప్ లు బెంగళూరుకు చెందినవే ఉన్నాయి. ఆ తర్వాత NCR, ముంబై స్టార్టప్ ఉన్నాయి. చెన్నై మినహా H1 CY23లోని అన్ని నగరాల్లో నిధుల కార్యకలాపాల క్షీణత నమోదు అయింది.


Click it and Unblock the Notifications