Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్లోకి భారీగా పెట్టుబడులు.. బంగారం ధర ఇంకా పెరుగుతుందా..!
గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం సెప్టెంబర్‌లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టులో గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి రూ. 2,597 కోట్ల పెట్టుబడులు రాగా.. సెప్టెంబర్‌లో 71.4 శాతం పెరిగి రూ. 4,451 కోట్లకు చేరింది. ఆగస్టులో నమోదైన రూ. 41,353 కోట్ల నికర నిధుల ప్రవాహానికి విరుద్ధంగా, ఈ నెలలో విస్తృత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రూ. 1.33 లక్షల కోట్ల నికర నిధుల ఉపసంహరణను ఎదుర్కొన్నప్పటికీ, గోల్డ్ ETFలలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. బంగారం ధర పెరుగుతుండడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
రా గోల్డ్ కొనుగోలుకు బదులుగా చాలా మంది గోల్డీ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈటీఎఫ్ ల్లో ఒకేసారి కాకుండా సిప్ రూపంలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి పెట్టుబడులు పెరుగుతున్న నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిక్స్‌డ్-ఇన్‌కమ్ మ్యూచువల్ ఫండ్ పథకాల నుంచి గణనీయమైన ఉపసంహరణలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా. డెట్ ఫండ్ల నుంచి భారీగా నిధులు బయటకు వెళ్లాయి. నిధుల ఉపసంహరణకు డెట్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద వనరుగా నిలిచాయి. వీటి నికర ఉపసంహరణలు అంతకుముందు నెలలోని రూ. 8,127 కోట్లతో పోలిస్తే, సెప్టెంబర్‌లో రూ. 1.83 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగాయి.

భారీ ఉపసంహరణల కారణంగా పరిశ్రమ మొత్తం నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM)పై భారం పడింది. ఆగస్టులో రూ. 87.08 లక్షల కోట్లుగా ఉన్న ఈ ఆస్తులు, సెప్టెంబర్‌లో రూ. 82.64 లక్షల కోట్లకు పడిపోయాయి. దీనికి విరుద్ధంగా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ పథకాలలోకి నికర పెట్టుబడులు ఆగస్టులోని రూ. 29,328 కోట్ల నుంచి సెప్టెంబర్‌లో 30.6 శాతం పెరిగి రూ. 38,307 కోట్లకు చేరింది. ఈక్విటీ విభాగాలలో, స్మాల్-క్యాప్ ఫండ్‌లు అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగంగా నిలిచాయి. గత నెలలో రూ. 7,973 కోట్లుగా ఉన్న పెట్టుబడులు రాగా.. సెప్టెంబర్‌లో రూ. 9,039 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. మిడ్-క్యాప్ ఫండ్‌లలో కూడా పెట్టుబడిదారుల భాగస్వామ్యం బలంగా ఉంది.
ఆగస్టులో రూ. 6,989 కోట్లుగా ఉన్న పెట్టుబడులు సెప్టెంబర్‌లో రూ. 7,835 కోట్లకు చేరింది. ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లలోకి గత నెలలో రూ. 5,059 కోట్ల పెట్టుబడులు రాగా.. సెప్టెంబర్ లో రూ. 6,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెరిగాయి. ఆగస్ట్ లో రూ. 1,713 కోట్లు ఉండగా.. సెప్టెంబర్ లో రూ. 3,640 కోట్లకు చేరియా. లార్జ్-క్యాప్ ఫండ్లలోకి సెప్టెంబర్ లో పెట్టుబడులు పెరిగాయి .ఆగస్టులో రూ. 1,147 కోట్ల నిధులు ఉపసంహరించుకోగా.. సెప్టెంబర్‌లో ఈ ఫండ్లలో రూ. 859 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు, మల్టీ-అసెట్ కేటాయింపు ఫండ్‌లు రూ. 3,667 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. ఇది గత నెలలోని రూ. 3,671 కోట్లతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIPలు) ద్వారా పెట్టుబడిదారుల భాగస్వామ్యం బలంగా కొనసాగింది. నెలవారీ SIP చెల్లింపులు సెప్టెంబర్‌లో రూ. 32,490 కోట్లతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది ఆగస్టులో నమోదైన రూ. 32,297 కోట్ల కంటే స్వల్పంగా ఎక్కువ.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications