ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్‌ఫ్లోలు సుమారు 16% పడిపోయాయి. మార్చిలో రూ.22,633.15 కోట్లుగా ఉన్న ఇన్‌ఫ్లో ఏప్రిల్‌లో రూ.18,917.09 కోట్లుగా తగ్గింది. నెలవారీ SIP డేటా మొదటిసారిగా రూ. 20,000 కోట్ల మార్కును దాటింది. మార్చిలో సిప్ పెట్టుబడులు రూ.19,271 కోట్లుగా ఉన్నాయి. స్మాల్‌క్యాప్ ఫండ్‌లు గత నెలలో రూ.94.17 కోట్ల అవుట్‌ఫ్లో తర్వాత మళ్లీ ఇన్‌ఫ్లోలను మొదలయ్యాయి.
ఈక్విటీ కేటగిరీలలో, ELSS, ఫోకస్డ్ ఫండ్‌లు మినహా అన్నీంటిలో ఏప్రిల్‌లో ఇన్‌ఫ్లోలు పెరిగాయి. సెక్టోరల్/థీమాటిక్ ఫండ్‌లు నెలల తరబడి అత్యధిక ఇన్‌ఫ్లోలను పొందుతూనే ఉన్నాయి. ఏప్రిల్‌లో 7,917.72 కోట్లు, మార్చిలో రూ. 5,166.05 కోట్ల ఇన్‌ఫ్లోలను వచ్చాయి. మల్టీక్యాప్ ఫండ్స్ ఇన్‌ఫ్లో చార్ట్‌లో రెండవ స్థానంలో నిలిచాయి. రూ. 2,723.87 కోట్ల నిధులను పొందాయి.

లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్స్ రూ. 2,638.91 కోట్ల ఇన్ ఫ్లోలను అందుకున్నాయి. ఏప్రిల్‌లో ఫోకస్డ్ ఫండ్ రూ. 328.04 కోట్లు, ELSS ఫండ్ల నుంచి రూ. 144.04 కోట్లు ఔట్ ఫ్లో వెళ్లాయి. మార్చిలో రూ. 1.98 లక్షల అవుట్‌ఫ్లో ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఏప్రిల్‌లో రూ. 1.89 లక్షల ఇన్‌ఫ్లోను అందుకోగలిగాయి. డెట్ కేటగిరీలలో, మీడియం డ్యూరేషన్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్, బ్యాంకింగ్ & పిఎస్‌యు ఫండ్స్ మినహా అన్ని ఫండ్లు ఇన్‌ఫ్లోలను చూశాయి.
లిక్విడ్ ఫండ్స్ ఏప్రిల్‌లో అత్యధికంగా రూ. 1.02 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో నమోదు చేయగా, మార్చిలో రూ. 1.57 లక్షల కోట్ల ఔట్ ఫ్లో నమోదైంది. ఏప్రిల్‌లో హైబ్రిడ్ ఫండ్ కేటగిరీల ఇన్‌ఫ్లోలు 256% క్షీణించాయి. ఇది మార్చిలో రూ. రూ.19,862.94 కోట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications