Investment: అనుమానాలు మాని ఇన్వెస్ట్ చేయండి.. లాభాలొస్తాయ్ బాస్.. ఈ 7 విషయాలు తెలుసుకోండి..

Investment: కరోనా కాలంలో చాలా మంది రెండు చేతులా స్టాక్ మార్కెట్ ద్వారా కూడా సంపాదించారు. ఈ క్రమంలో చాలా మంది యువత మార్కెట్లను నమ్మారు, లాభాలను సైతం పొందారు. కానీ ఇందుకోసం కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి ధైర్యం కావాలి. సరైన జ్ఞానంతో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. అందువల్ల ప్రస్తుతం నిపుణులే కాదు పరోక్షంగా ప్రభుత్వం సైతం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.

కొంచెం తెలివి.. కొద్దిగా అవగాహన..
తక్కువ కాలంలో మార్కెట్ నుంచి మంచి డబ్బు సంపాదించటానికి నైపుణ్యంతో పాటు, మార్కెట్ల పనితీరుపై అవగాహన అవసరం. దీనిని కొనసాగించాలంటే పట్టు పెంచుకోవటం ఒక్కటే సరైన మార్గం. అలా సరైన కంపెనీల ఎంపిక, సమయానుకూలంగా పెట్టుబడుల్లో మార్పులు చేయటం సరైనదని నిపుణులు సూచిస్తుంటారు. స్ట్రాంగ్ పోర్ట్ ఫోలియో నిర్మించుకుంటే లాభాలు ఆటోమెటిక్ గా వస్తాయి. అసలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎందుకు లాభదాయకమైన ఆలోచన అనేదానిని అర్థం చేసుకోవాలంటే.. ముందుగా ఈ 7 విషయాలను తెలుసుకోండి..

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం

దేశంలోద్రవ్యోల్బణం పెరగటం అంటే వస్తువులు, సేవల ధరలు పెరుగుతున్నాయని అర్థం. దీనివల్ల మార్జిన్లు తగ్గకుండా కంపెనీలు ప్లాన్ చేసుకుంటాయి కాబట్టి.. వాటి ఆదాయం, లాభాలు అంతకు ముందుకంటే కొంత పెరుగుతాయి. అస్థిర పరిస్థితుల్లోనూ మెరుగైన పనితీరు కనబరిచే క్వాలిటీ కంపెనీల షేర్లు మాత్రం పెరుగుతాయి. అది షేర్ల ధరలు పెరిగేందుకు దారితీస్తుంది. సో సరైన ఇన్వెస్ట్ మెంట్ చేస్తే లాభాలు పక్కా.

దేశ జనాభా

దేశంలో జనాభా పెరుగుతున్న కొద్దీ కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్ కూడా పెరుగుతుంది. అలా పెరిగే జనాభా కోసం కంపెనీలు మరింత భారీ స్థాయిలో తమ తయారీని పెంచవలసి ఉంటుంది. అది కంపెనీల లాభదాయకతను పెంచటంతో పాటు వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది.

టెక్నాలజీ

టెక్నాలజీ

పెరిగిన జనాభా అవసరాల కోసం టెక్నాలజీ చాలా కీలకం. అంత మందికి సేవలు అందించటానికి మెరుగైన సాంకేతికతకు డిమాండ్ పెరుగుతుంది. పైగా ఆధునిక కాలంలో అన్నీ ఆన్ లైన్ మయం అవటంతో ఈ రంగంలోని కంపెనీల లాభాలకు కొదవ ఉండదని చెప్పుకోవచ్చు. పైగా ఉద్యోగ అవకాశాలు సైతం మెరుగుపడతాయి.

మార్కెట్ సూచీలు..

స్టాక్ మార్కెట్‌లోని బెంచ్ మార్క్ సూచీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచే కంపెనీలను చేర్చుతారు. వీటిలో ఎక్కువ శాతం లార్జ్ క్యాప్ బ్లూచిప్ సంస్థలు ఉంటాయి. వీటిలో పనితీరు సరిగా లేని కంపెనీలను తొలగిస్తారు. ఈ సూచీలను పరిశీలించటం ద్వారా పెట్టుబడికి సరైన కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు.

దీర్ఘకాలంలో..

దీర్ఘకాలంలో..

ఇన్వెస్టర్లు స్వల్పకాలిక లాభాల కోసం పరుగులు తీస్తే.. ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రిస్క్ అంటే ఎక్కువ నష్టపోయే అవకాశం. అలాగే ఈ క్రమంలో లాభం వచ్చినా ఎక్కువగానే ఉంటుంది. అయితే దీర్ఘకాలం కోసం చూస్తున్నట్లయితే.. రిస్క్ తక్కువగానే ఉంటుంది.

వడ్డీ రేట్ల ప్రభావం..

ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు సహజంగా ప్రజలు డబ్బును ఖర్చు చేయడం మానేస్తారు లేదా చాలా వరకు తగ్గిస్తారు. అలాంటి సందర్భాల్లో.. ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి, RBI వడ్డీ రేట్లను తగ్గించి ఎకానమీలో లిక్విడిటీని పెంచుతుంది. అలాంటి సందర్భంలో బ్యాంక్ పెట్టుబడులపై రాబడులు తగ్గుతాయి. చాలా మంది ఆ డబ్బును మంచి లాభాల కోసం కొంత రిస్క్ తీసుకుంటూ చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తారు.

స్టాక్ మార్కెట్ గతం ఘనం..

స్టాక్ మార్కెట్ గతం ఘనం..

మార్కెట్లు ఎల్లప్పుడూ పెరగటం లేదా పడిపోవటం మాత్రమే కొనసాగదు. ఇలా పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. దీర్ఘకాలంలో బుల్లిష్ మెుమెంటం.. ఎల్లప్పుడూ డౌన్‌ట్రెండ్‌ను అధిగమిస్తుంది. సెన్సెక్స్ గత 33 ఏళ్ల చరిత్రను గమనిస్తే.. మనకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే.. సగటున సూచీ 15 శాతం రాబడిని అందించింది. కాబట్టి సరైన పెట్టుబడి నిర్ణయాలు ఎప్పుడూ లాభాలను అందిస్తాయి. చాలా మంది మార్కెట్ మెకానిజం తెలియకుండా.. పెట్టుబడులు పెట్టి నష్టపోయి చివరికి వాటిని గ్యాంబ్లింగ్ అంటూ ముద్ర వేస్తుంటారు.

NOTE: పైన తెలిపిన సమాచారం కేవలం మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్న అంశం. కాబట్టి ఎల్లప్పుడూ మీ అర్థిక సలహాదారుని సూచనల మేరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+