2024 Markets: న్యూ ఇయర్ కూడా మార్కెట్లు బులిష్.. ఈ షేర్లలోనే ర్యాలీ.. నిపుణుల మాటిదే..
Bull Markets: 2023లో స్టాక్ మార్కెట్లు ఊహించిన దానికంటే అధికమైన రాబడులను డెలివరీ చేశాయి. దీనికి కారణంగా ప్రధానంగా బుల్ రన్ అని తెలిసిందే. గ్లోబల్ ఎకానమీ కోలుకుంటున్న వేళ దేశీయ మార్కెట్లు మెగా ర్యాలీని కొనసాగించాయి.
అయితే 2024లో చాలా మంది ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్లు కరెక్షన్ బాట పడతాయేమోననే ఆందోళనలో ఉన్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల నయా గరిష్ఠాలను అధిరోహించిన వేళ పరిస్థితలు పై మనీకంట్రోల్ మార్కెట్స్ పోల్ లో నిపుణుల ఓటింగ్ ఊరటను కలిగిస్తోంది. కొత్త ఏడాదిలో మార్కెట్లు తమ ర్యాలీని కొనసాగిస్తాయని, పరంపరను వరుసగా తొమ్మిదవ సంవత్సరానికి విస్తరింపజేస్తుందని ఆశలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో కొన్ని జాగ్రత్తలు సైతం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనీకంట్రోల్ మార్కెట్స్ నిర్వహించిన సర్వేలో 35 మంది విశ్లేషకులు, ఫండ్ మేనేజర్‌లలో దాదాపు సగం మంది 2024 చివరి నాటికి నిఫ్టీని 23,000 నుంచి 25,000 రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. 6-15 శాతం రాబడిని అందిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సూచీ గత ఏడాది 19 శాతం రాబడిని ఇచ్చి 21,731 వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 21,801ని కూడా తాకింది.
వడ్డీ రేట్ల తగ్గింపులు, బాండ్ ఈల్డ్‌లలో తగ్గుదల కారణంగా నూతన ఏడాది ప్రారంభంలో మార్కెట్ల ర్యాలీ ఆనందం కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ భావిస్తున్నారు. CY24లో ప్రధాన మార్కెట్‌లో 10-12 శాతం నిరాడంబరమైన రాబడిని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్ నిఫ్టీ, పోల్ ప్రకారం 2024లో కూడా ఇదే విధమైన వార్షిక పనితీరును కలిగి ఉంటుందని అంచనా వేశారు.
పోల్‌లో పాల్గొన్న చాలా మంది విశ్లేషకులు 2024 లార్జ్‌క్యాప్ స్టాక్‌లకు చెందుతుందని చెప్పారు. పోల్ చేసిన 51 శాతం మంది విశ్లేషకులు, ఫండ్ మేనేజర్‌లు మిడ్‌క్యాప్ విభాగం లార్జ్‌క్యాప్‌లను అధిగమిస్తుందనే నమ్మకం లేదని పేర్కొనగా.. 54 శాతం మంది స్మాల్‌క్యాప్‌లు లార్జ్ క్యాప్‌లను అధిగమించడంలో విఫలమవుతాయని చెప్పారు.


Click it and Unblock the Notifications