Future Stocks: రానున్న ర్యాలీ ఆ రెండు రంగాల కంపెనీల్లోనే.. పూర్తి వివరాలు..

Future Stocks: మార్కెట్లలో ఎల్లప్పుడూ ఒకే రంగానికి చెందిన కంపెనీలు లాభాల్లో లేదా నష్టాల్లో ఉండవు. అవి మార్కెట్ సైకిల్స్, మారుతున్న భవిష్యత్తు అవసరాలు, డిమాండ్స్ వంటి అనేక కారణాలతో మారిపోతుంటాయి.

వైట్ ఓక్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ ఖేమ్కా ప్రస్తుతం తాను ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్ రంగాలపై బులిష్‌గా ఉన్నట్లు తెలిపారు. బలమైన ఫండమెంటల్స్‌తో ఆకర్షణీయంగా విలువైన కంపెనీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఖేమ్కా కేవలం ఫార్మాస్యూటికల్ రంగంలోనే కాకుండా మొత్తం ఆరోగ్య సంరక్షణ రంగంలో కొన్ని కంపెనీలను ఇష్టపడుతున్నారు.

Investment experts bullish over pharma and speciality chemical stocks, know why?

సెప్టెంబర్ 13 నాటికి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు ఒక శాతం పెరిగి 15,448.95 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే గత ఆరు నెలల్లో ఇండెక్స్ 33 శాతం రాబడిని.. ఏడాదిలో 21.82 శాతం రాబడిని అందించింది. అయితే కంపెనీలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని సూచించారు.

ఇదే క్రమంలో 17 ఏళ్లుగా ఫార్మా రంగాన్ని ట్రాక్ చేస్తున్న Incred PMSలో ఫండ్ మేనేజర్ ఆదిత్య ఖేమ్కా మాత్రం హాస్పిటల్స్ స్టాక్స్ కొనటానికి ప్రస్తుతం సరైన సమయం కాదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాను డయాగ్నస్టిక్స్ రంగంపై మాత్రం సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. చైనా లాక్ డౌన్ ముగియటంతో ఫార్మా ముడి పదార్థాలు, కెమికల్స్ ధరలు తగ్గటంతో మార్జిన్లు పెరిగాయని అందువల్ల ఈ రంగంపై ఇన్వెస్టర్లు మళ్లీ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+