Mutual Funds: నెలకు రూ.10 వేలతో రూ.40 లక్షలు మీ సొంతం..!
చాలా మంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. కానీ అది చాలా మందికి సాధ్యం కాని పని. ఎందుకంటే మంచి కంపెనీని గుర్తించి అది భవిష్యత్ లో ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. అంతేకాకుండా ప్రతి రోజు దాన్ని ట్రాక్ చేయడం ఇబ్బందే. అందుకే స్టాక్ మార్కెట్ కంటే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం బెటరని నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి కూడా రిస్క్ తో కూడుకున్నవే. అయితే దీర్ఘ కాలంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలో లాభాలు మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్ పై ఆధారపడి ఉంటాయి. మ్యూచువల్ ఫండల్లో ఏక మొత్తం లేదా సిప్ రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు.
క్రమశిక్షణతో కూడిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) భారీగా సంపదను సృష్టించగలదు. ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని స్థిరంగా అధిక రాబడిని అందించే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అనేక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు గత 10 ఏళ్లలో వార్షిక రాబడి 18 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఒక పెట్టుబడిదారుడు 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టారని అనుకుంటే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఈ ఫండ్లలో అసలు పెట్టుబడి మొత్తం కంటే చాలా ఎక్కువగా సొమ్ము వచ్చే అవకాశం ఉంది.

గత 10 ఏళ్లలో క్వాంట్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ అత్యధికంగా 22.84% వార్షిక SIP రాబడిని అందించింది. దీని ప్రకారం 10 సంవత్సరాల పాటు నెలకు రూ.10,000 చొప్పున చేసిన సిప్ పెట్టుబడి పెడితే ఇది రూ.40.1 లక్షలకు పెరిగేది. అంటే ఇది పెట్టుబడి పెట్టిన మొత్తానికి మూడు రెట్ల కంటే ఎక్కువ. బ్యాంక్ ఆఫ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 22.37 శాతం వార్షిక SIP రాబడితో అదే రూ.12 లక్షల పెట్టుబడిని దాదాపు రూ.39.1 లక్షలకు చేరుతుంది.
ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ గత పది సంవత్సరాల్లో వార్షికంగా 22.32 శాతం రాబడి ఇచ్చింది. ఇందులో నెలకు రూ.10 వేలు, 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మీ డబ్బు రూ.39 లక్షలకు చేరుకునేది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకే ఫండ్ లో కాకుండా రెండు లేదా మూడు ఫండ్ హౌస్ ల్లో పెట్టుబడి పెట్టడం బెటరని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications