Post Office RD: రికరింగ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే ఐదేళ్లలో రూ.21 లక్షలు..!
ఈక్విటి మార్కెట్లు పడిపోతున్న వేళ పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి వైపు మళ్లుతున్నారు. కచ్చితమైన ఆదాయాలు వచ్చే పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడిదారులు ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ (RD) పథకాలను ఎంచుకుంటున్నారు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే.. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారు.పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది సులభమైన పథకంగా ఉంది.
ఇందులో తక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు నెలకు రూ.100 నుండి పెట్టుబడి పెట్టడానికి కూడా వీలు ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ పథకంలో మనం సరిగ్గా ప్లాన్ చేసి పెట్టుబడి పెడితే ఐదేళ్లలో 21 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ పథకాలలో పెట్టుబడిదారులకు సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. అంతే కాకుండా, అందుబాటులో ఉన్న వడ్డీ మొత్తం ప్రతి క్యాలెండర్ సంవత్సరానికి సమ్మేళనం ఆధారంగా లెక్కిస్తారు.

ఇది మెచ్యూరిటీ సమయంలో గరిష్ట మొత్తాన్ని పొందేందుకు ఉపయోగపడుతుంది. పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న RD పథకాలకు సంబంధించి మెచ్యూరిటీ వ్యవధిగా ఐదేళ్ల వ్యవధిని ఉంచారు. అంటే మీరు వరుసగా 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అవసరమైన వారు ఐదేళ్లు పూర్తయిన తర్వాత మరో ఐదేళ్లపాటు పథకాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం మీరు నెలకు కనీసం 100 రూపాయల నుంచి గరిష్టంగా ఎంత మొత్తంలోనైనా పెట్టుబడి పెట్టవచ్చు.
మీరు ఈ పథకంలో ప్రతి నెలా 30,000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 5 సంవత్సరాల తర్వాత మీకు 21 లక్షల రూపాయలు లభిస్తాయి. అంటే 5 సంవత్సరాల పాటు మొత్తం 60 నెలల పాటు ఈ పథకంలో మొత్తం రూ. 18 లక్షలు పెట్టుబడి పెడతారు. మీకు వడ్డీ రూ.3,40,974 కలిపి మొత్తం రూ.21,40,974 వస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు.


Click it and Unblock the Notifications