ఇన్వెస్టింగ్ లో మ్యూచువల్ ఫండ్స్ చాలా సులభంగా, భరోసా కలిగించే మార్గం. మీరు ఒక్కో స్టాక్‌ను ఎంచుకోవడం, మార్కెట్‌ను ఎప్పుడూ గమనించడం కష్టంగా అనిపిస్తే, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. ఒక్కో ఫండ్‌లోనే వేర్వేరు కంపెనీల షేర్లు, విభిన్న సెక్టార్లు, మార్కెట్ క్యాప్స్ ఉంటాయి కాబట్టి, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా మీరు ఇప్పటికే మంచి డైవర్స్‌ఫికేషన్ పొందుతారు. దీన్ని చాలా మంది చిన్న పెట్టుబడితో పెద్ద రాబడికి మార్గం చూపే విధంగా వాడుతున్నారు. కాబట్టి, స్టాక్ మార్కెట్ లో నేరుగా జంప్ కాకుండానే, సురక్షితంగా పెట్టుబడి పెట్టాలంటే, మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి.

అయితే మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో నిజంగా ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి అనేది చాలా మంది ఇన్వెస్టర్లకు సందేహం ఉంటుంది. చాలా సార్లు, ఎక్కువ ఫండ్స్ పెట్టుకోవడం వల్ల మీ రిటర్న్స్ పెరుగుతాయంటూ భావిస్తారు, కానీ నిజానికి పరిస్థితి అలా కాదు. సింపుల్,
నిజంగా చెప్పాలంటే మీ పోర్ట్‌ఫోలియోలో 3 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ అవసరం లేదు అని నిపుణలు చెప్తున్నారు.
ఎందుకంటే, మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే డైవర్స్‌ఫైడ్ గా ఉంటాయి. ఒక ఈక్విటీ ఫండ్‌లోనే 30 నుంచి 100 కంటే ఎక్కువ కంపెనీల షేర్లలో పెట్టుబడి ఉంటాయి. అంటే మీరు 3-4 ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే, అప్పటికే విభిన్న సెక్టార్లు, వివిధ మార్కెట్ క్యాప్స్‌లో అనేక కంపెనీలలో ఎక్స్‌పోజర్ పొందుతారు. కాబట్టి, తక్కువ ఫండ్స్ పెట్టినా కూడా మంచి డైవర్స్‌ఫికేషన్ సాధించవచ్చు. అదే సమయంలో, ఎక్కువ ఫండ్స్ జోడించడం ద్వార అవి మీ రిటర్న్స్ పెంచదు. నిజానికి, ఇది సమస్యలను సృష్టిస్తుంది. ఒకే తరహా స్టాక్‌లలో డూప్లికేషన్ ఎక్కువ అవుతుంది, ఫండ్ల పనితీరు పలుచన అవుతుంది, అలాగే మీ పోర్ట్‌ఫోలియోను ట్రాక్ చేయడం, అర్థం చేసుకోవడం కష్టంగా అవుతుంది.
ఎవరైనా ఎక్కువ ఎక్కువ ఫండ్స్ పెట్టమని చెబుతున్నారు అంటే, అది వారి లాభం కోసం మాత్రమే. కమీషన్, ఇన్సెంటివ్స్ లేదా ఇతర హిడెన్ లాభాల కోసం సలహాలు ఇచ్చే వారు ఎక్కువగా ఫండ్స్ పెట్టమని సూచిస్తారు, కానీ అది పెట్టుబడిదారుల కోసం కాకుండ వారికి మాత్రమే లాభం వస్తుంది. సరైన విధానం ఏంటంటే, ఫోకస్ ఉన్న, బాగా ప్లాన్ చేసిన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో. ఇది ఎక్కువగా డైవర్స్‌ఫైడ్ అయిన, చెల్లాచెదురుగా ఉన్న పోర్ట్‌ఫోలియో కంటే చాలా ప్రభావంతంగా ఉంటుంది. మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ని సింపుల్‌గా ఉంచండి, నాణ్యమైన ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి, మరియు ముఖ్యంగా, మీరు ఏం కొనుగోలు చేసారో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి.
ముఖ్యంగా, ఇన్వెస్టింగ్ అంటే కేవలం పెట్టుబడి పెట్టడం కాదు. ముఖ్యమైనది, మీ పెట్టుబడిని గమనిస్తూ, సజాగ్రతగా, విశ్లేషిస్తూ, సంపదను పెంచడం. చిన్న, సరళమైన, నాణ్యమైన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో దీర్ఘకాలంలో అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications