మ్యూచువల్ ఫండ్లలో సిప్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) జూన్ 30, 2022 నాటికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఖాతాలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 5.54 కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది. AMFI డేటా ప్రకారం జూన్ 2022 నాటికి మొత్తం సిప్ పెట్టుబడులు రూ. 5.51 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

ఈక్విటీ
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడిదారుని మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. SIPలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి అత్యంత సమర్థవంతమైన ఎంపిక. పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా, కొంతమంది ఈక్విటీ పెట్టుబడిదారులు దానిని సురక్షితంగా ఉంచుకోవాలని చూస్తారు.

HDFC టాప్ 100
వారు లార్జ్ క్యాప్ పథకాల్లో పెట్టుబడి పెడతారు. ఇతర ప్యూర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలతో పోలిస్తే, ఈ ఫండ్స్ టాప్ 100 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్‌ల కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్లలో, HDFC టాప్ 100 అధిక రిటర్న్స్ ఇస్తోంది. ఈ ఫండ్ లార్జ్ క్యాప్ స్టాక్‌లలో 97% పెట్టుబడి పెడుతోంది. ఈ ఫండ్ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలలో వరుసగా 15.8%, 11.23% మరియు 13.86% రాబడిని అందించింది.

ICICI
ICICI ప్రుడెన్షియల్ లార్జ్ & మిడ్‌క్యాప్ లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్లలో ICICI ప్రుడెన్షియల్ లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్‌ను పరిగణలోకి తీసుకొవచ్చు. ఆటో రంగాలలో పెరుగుతున్న కేటాయింపులతో బ్యాంకింగ్ స్టాక్‌లపై ఆసక్తి కొనసాగడం ఫండ్‌కు బాగా ఉపయోగపడింది. ఈ రెండు ఇండెక్స్‌లు ఇటీవలి కాలంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. పనితీరు వారీగా, ఫండ్ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలలో వరుసగా 22.48%, 12.97% మరియు 15.06% రాబడిని అందించింది.

SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్
రిస్క్ తీసుకునేవారు SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్, కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్‌లను పరిగణలోకి తీసుకొవచ్చు. SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్ స్థిరమైన బలమైన పనితీరును కలిగి ఉంది. ఫండ్ వృద్ధి,పెట్టుబడి విలువ శైలిపై దృష్టి సారించి బాటమ్-అప్ విధానాన్ని అనుసరిస్తుంది. ఫండ్ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలలో వరుసగా 30.72%, 14.08% మరియు 20.77% డెలివరీ చేసింది.

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్
కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ 2019లో ప్రారంభమైంది.ఈ ఫండ్ ఫోకస్ నాణ్యమైన కంపెనీలపై దృష్టి సారించింది.ఈ ఫండ్ 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాల కాలంలో వరుసగా 21.65%, 49.34, 39.62% రిటర్న్స్ ఇచ్చింది..

క్వాంట్ యాక్టివ్ ఫండ్
మల్టీ క్యాప్ విషయానికొస్తే క్వాంట్ యాక్టివ్ ఫండ్ పరిగణలోకి తీసుకొవచ్చు. ఈ ఫండ్ వరుసగా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాల కాలంలో 35.42%, 21.58%, 21.21% రాబడి ఇచ్చింది. మీకు మ్యూచువల్ ఫండ్లపై అవగాహన లేకుంటే. మ్యూచువల్ ఫండ్ మేనజర్ల సలహా తీసుకొవచ్చ.
NOte: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications