పన్ను మినహాయింపుతోపాటు అధిక లాభాలను అందించే ELSS మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకెవరికైనా తెలుసా... అసలు ELSS మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమైనా వివరాలు తెలుసా..చాలామందికి ఈ ELSS మ్యూచువల్ ఫండ్స్ పై అంతగా అవగాహన ఉండదు..అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ అత్యధిక లాభాలను అందిస్తాయి. అలాగే పన్ను మినహాయింపు కూడా ఈ ELSS మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లభిస్తోంది.
ELSS ఫండ్స్ అనేవి తమ కార్పస్‌లో ఎక్కువ భాగాన్ని ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత రంగాల్లో పెట్టుబడిగా పెడతాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మీ ఆదాయం నుండి రూ. 150,000 వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు వీటితో. అందుకే ఈ ఫండ్స్ ను పన్ను ఆదా ఫండ్స్ అని కూడా పిలుస్తుంటారు.

సాధారణంగా ఆదాయం కలిగిన ప్రతి వ్యక్తి తన ఆదాయంపై పన్ను భారం తగ్గించుకోవాలని చూస్తుంటాడు. అలాంటి వారికి ELSS మ్యూచువల్ ఫండ్స్ (Equity Linked Savings Scheme) ఒక ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఈ ఫండ్స్ సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపు కల్పించడమే కాకుండా.. దీర్ఘ కాలంలో లాభాలను కూడా అందిస్తాయి. అయితే ELSS ఫండ్స్‌కి కేవలం మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఇది సెక్షన్ 80C కింద వచ్చే అన్ని పెట్టుబడుల్లో అతి తక్కువదిగా మనం చెప్పుకోవచ్చు.
ELSS ఫండ్స్ అనేవి ప్రధానంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి చేస్తాయి. ఇవి పెద్ద కంపెనీలు (Large Cap), మధ్య స్థాయి కంపెనీలు (Mid Cap), చిన్న కంపెనీలు (Small Cap)తో పాటుగా విభిన్న రంగాలలో పెట్టుబడి చేయడం ద్వారా లాభాల ఫోర్ట్ పోలియో ఉంటుంది. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల్లో అత్యధిక లాభాలు అందించిన టాప్ 5 ELSS మ్యూచువల్ ఫండ్స్ వివరాలు ఓ సారి చూడండి. వీటిల్లో రూ. 2.5 లక్షలు పెట్టుబడి పెడితే..5 ఏళ్ల తిరిగేసరికి 10. 7 లక్షలు చేతికి వచ్చాయి.
క్వాంట్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్
ఈ ఫండ్ గత 5 సంవత్సరాల్లో 33.76 శాతం వార్షిక రాబడి (Annualised Return) ఇచ్చింది. ఇది టాప్ ఫండ్ గా నిలిచింది.
నెట్ ఆస్తి విలువ (NAV): రూ. 399.32
నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM): రూ. 11,329 కోట్లు
ప్రారంభం నుంచి 5 ఏళ్లలో రాబడి: 20.5%
ఖర్చు నిష్పత్తి (Expense Ratio): 0.52%
కనీస SIP: రూ. 500 | కనీస మొత్తం పెట్టుబడి: ₹1,000
రూ. 2.5 లక్షల పెట్టుబడి విలువ (5 సంవత్సరాల్లో): రూ. 10,70,000
ఇది అన్ని ELSS ఫండ్స్ లో అత్యధిక లాభం ఇచ్చిన ఫండ్.
SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
ఇది ఒక స్థిరమైన ట్రాక్ రికార్డు కలిగిన విశ్వసనీయ ఫండ్.
5 ఏళ్ల రాబడి: 28.91%
నెట్ ఆస్తి విలువ (NAV): రూ. 467.55
నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM): రూ. 29,667 కోట్లు
ఖర్చు నిష్పత్తి (Expense Ratio): 0.93%
రూ. 2.5 లక్షల పెట్టుబడి విలువ: 5 ఏళ్లకు రూ.8,90,000
మోటీలాల్ ఓస్వాల్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్
ఇది ఎక్కువగా కొన్ని ఎంపిక చేసిన స్టాక్స్ లో పెట్టుబడి చేసే విధానాన్ని అనుసరిస్తుంది.
5 ఏళ్ల రాబడి: 28.74%
నెట్ ఆస్తి విలువ NAV: రూ. 58.88
నిర్వహణలో ఉన్న ఆస్తులు AUM: రూ. 4,360 కోట్లు
ఖర్చు నిష్పత్తి (Expense Ratio): 0.64%
రూ. 2.5 లక్షల పెట్టుబడి విలువ: 5 ఏళ్లకు 8,84,000
HDFC ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్
భద్రత మరియు స్థిరత కోరుకునే పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపిక.
5 ఏళ్ల రాబడి: 27.80%
నెట్ ఆస్తి విలువ NAV: రూ. 1,504.47
నిర్వహణలో ఉన్న ఆస్తులు AUM: రూ. 16,454 కోట్లు
ఖర్చు నిష్పత్తి (Expense Ratio): 1.05%
రూ. 2.5 లక్షల పెట్టుబడి విలువ: 5 ఏళ్లకు రూ. 8,52,000
DSP ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్
ఈ ఫండ్ స్థిరమైన పనితీరు కలిగి ఉంది మరియు విభిన్న రంగాల్లో పెట్టుబడులు చేస్తుంది.
5 ఏళ్ల రాబడి: 26.67%
నెట్ ఆస్తి విలువ NAV: రూ.153.39
నిర్వహణలో ఉన్న ఆస్తులు AUM: రూ. 16,974 కోట్లు
ఖర్చు నిష్పత్తి (Expense Ratio): 0.74%
రూ. 2.5 లక్షల పెట్టుబడి విలువ: 5 ఏళ్లకు 8,15,000
ELSS మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి చేస్తే పన్ను మినహాయింపు మాత్రమే కాకుండా, ఎక్కువ కాలంలో ఉత్తమ ఆదాయం కూడా అందుకోవచ్చు. భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం కూడా ELSS మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications