Bank FD Vs Postal Schemes: చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే చాలా మంది పోస్టాఫీస్ స్కీమ్స్ ప్రధానంగా ఎంచుకుంటుంటారు. వీటిలో పెట్టుబడులు సురక్షితంగా ఉండటంతో పాటు ఖచ్చితమైన రాబడి కూడా ఉంటుంది. పైగా గత కొంత కాలంగా రిజర్వు బ్యాంక్ రేట్ల పెంపు వల్ల వడ్డీ రేట్లను అన్నా బ్యాంకులు పెంచుతున్నాయి. అయితే ఈ సారి త్రైమాసిక సమీక్షలో ఫోస్టల్ స్కీమ్స్ పై వడ్డీలు కూడా పెరగవచ్చని నిపుణులు అంటున్నారు.

మంచి రాబడులు..
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల కంటే పోస్టల్ పథకాలు మెరుగైన వడ్డీ రేట్లతో మంచి రాబడులను అందిస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టర్లు ధనవంతులుగా మారుతున్నారు. రిటైర్ అయ్యిన తర్వాత అవసరాల కోసం కార్పస్ కూడబెట్టాలనుకునేవారికి ఈ స్కీమ్స్ ఉత్తమమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి.

పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)..
పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడిదారులు 15 ఏళ్ల పాటు నిరంతరం పెట్టుబడి పెట్టాలి. సబ్‌స్క్రైబర్‌లు ఐదేళ్ల పెట్టుబడి తర్వాత పాలసీ నుంచి నిష్క్రమించడానికి వీలు ఉంటుంది. 7వ సంవత్సరం నుంచి పాక్షికంగా డిపాజిట్ల మెుత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుంది. అలాగే నాలుగో ఏడాది నుంచి దానిపై లోన్ పొందే వెసులుబాటు కూడా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో పెట్టుబడులకు ప్రభుత్వం ఏడాదికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSC)..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ప్రస్తుతం పెట్టుబడిదారులకు 6.8 శాతం రాబడిని అందిస్తోంది. పన్ను ప్రయోజనాలతో పాటు ఫిక్స్‌డ్ రిటర్న్ పాలసీతో ఈ స్కీమ్ ఐదేళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఇందుకోసం ఇన్వెస్టర్లు ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో మొత్తం చెల్లించబడుతుంది.

పోస్టాఫీసు సుకన్య సమృద్ధి యోజన (SSY)..
పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధి యోజన అనేది కుమార్తెలను కలిగి ఉన్న వారికి ఉపయోగపడే మంచి పెట్టుబడి పథకం. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరిట ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్ 21 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది

పోస్టాఫీసు సుకన్య సమృద్ధి యోజన (SSY)..
పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధి యోజన అనేది కుమార్తెలను కలిగి ఉన్న వారికి ఉపయోగపడే మంచి పెట్టుబడి పథకం. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరిట ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్ 21 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఆ డబ్బు పిల్లల చదువులకో, పెళ్లికో ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారులు 7.6 శాతం వార్షిక వడ్డీ రేటును అందుకుంటారు.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD)..
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం లాగానే ఉంటుంది. సబ్‌స్క్రైబర్‌లు 1, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలవ్యవధికి ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. 5 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే స్కీమ్ కోసం పెట్టుబడిదారులు పన్ను రాయితీ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద పెట్టుబడిదారులకు 6.7 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల కోసం రూపొందించిన స్కీమ్. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఈ స్కీమ్ కింద పొదుపు చేసుకున్న పెట్టుబడిదారులకు 7.4% వడ్డీ రేటును అందిస్తోంది. ఇలా ఈ ఐదు పోస్టల్ స్కీమ్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications