అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంక విధానాలు, పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారుతోంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్ తీవ్రమైన అస్థిరతను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడిదారులకు మరో పెద్ద హెచ్చరిక జారీ చేశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటివరకు చూడని అతి పెద్ద పతనం (biggest crash)సంభవించవచ్చని తెలిపారు. మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండాలనుకుంటే, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టండి. కష్టకాలంలో మీకు మద్దతు ఇచ్చేది కేవలం రియల్ ఆస్తులేనని కియోసాకి తెలిపారు.తన ప్రసిద్ధ పుస్తకం రిచ్ డాడ్‌స్ ప్రాఫసీ లోనే ఆయన ఈ భారీ ఆర్థిక పతనాన్ని ముందుగానే ఊహించానని Robert Kiyosaki పేర్కొన్నారు.

బేబీ బూమర్ తరం పదవీ విరమణలు భారీ ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తాయి. అనేక మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోతారు, కొంతమంది నిరాశ్రయులవుతారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అవుతుందని ఆయన అన్నారు. కియోసాకి ప్రకారం.. ఈ సమయంలో అత్యంత బలమైన, సురక్షిత పెట్టుబడులు బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథీరియం (Ethereum) అని అన్నారు. నేడు, వెండి, ఈథీరియం రెండూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు అని చెప్పుకొచ్చారు. ఇవి కేవలం విలువను నిలుపుకోవడమే కాకుండా పరిశ్రమలలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం వీటి ధరలు తక్కువగా ఉండడం పెట్టుబడిదారులకు లాభదాయకంగా మారుతుందని ఆయన సలహా ఇచ్చారు.
కియోసాకి పెట్టుబడిదారులకు సూచిస్తూ.. వెండి, ఈథీరియం యొక్క లాభాలు, నష్టాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆర్థిక అవగాహన పెంపు ద్వారానే నిజమైన సంపదను నిర్మించవచ్చు. డబ్బు సంపాదించడంలో కాకుండా, దాన్ని సురక్షితంగా పెట్టుబడి పెట్టడంలోనే తెలివి ఉంటుందని అన్నారు. తాజాగా ఆయన మరో ప్రకటనలో వెండి ప్రస్తుతం 50 డాలర్ల వద్ద ఉంది కానీ త్వరలో 75 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెండి, ఈథీరియం నేటి అత్యంత వేడి ఆస్తులు (hottest assets) అని ఆయన అన్నారు.
వాస్తవానికి, కియోసాకి గతంలో చేసిన అంచనాలు ఇప్పటికి నిజమవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. 2025 ప్రారంభం నుంచే బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి, కానీ రాబడి పరంగా వెండి బంగారాన్ని అధిగమించింది. తాజా మార్కెట్ డేటా ప్రకారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గత వారం చివరి ట్రేడింగ్ రోజున బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,23,677కి చేరుకోగా, వెండి ధర కిలోకు రూ.1,53,388కు పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు,ద్రవ్యోల్బణం పెరుగుదల,సెంట్రల్ బ్యాంక్‌ల ఆర్థిక విధానాలు కూడా ఈ మార్పులకు కారణమవుతున్నాయి. రాబర్ట్ కియోసాకి సూచించినట్లు, పెట్టుబడిదారులు ఇప్పుడు రియల్ ఆస్తులు (Real Assets) అంటే బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, క్రిప్టో వంటి వాటిపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థిక భద్రతను సాధించవచ్చు అని తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications