ట్రూజెట్‌లోకి అమెరికా సంస్థ నుండి 49% పెట్టుబడులు, ఎందుకంటే
హైదరాబాద్‌కు చెందిన ప్రాంతీయ ఎయిర్‌లైన్స్ సంస్థ ట్రూజెట్‌కు అమెరికాకు చెందిన కంపెనీ పెట్టుబడులు సమీకరించింది. ఈ మేరకు ఈ సంస్థ గురువారం ప్రకటించింది. న్యూయార్క్‌కు చెందిన ఇంటరప్స్ ఇంక్ 49 శాతం పెట్టుబడులను ట్రూజెట్‌లోకి తీసుకు వచ్చినట్లు వెల్లడించింది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది.
ఉడాన్ మార్గాల్లో విమాన సర్వీసులు అధికంగా నిర్వహించే ట్రూజెట్ (టర్బో మేఘా)కు విదేశీ పెట్టుబడి లభించింది. ఇంటరప్స్ ఇంక్, ట్రూజెట్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసి నిధులు సమకూర్చింది. దేశవ్యాప్తంగా 21 ద్వితీయ శ్రేణి నగరాలు, ప్రధాన పట్టణాలకు ఏడు ఏటీఆర్ 72 విమానాలతో ఈ సంస్థ సర్వీసులు నిర్వహిస్తోంది. ఇందులో హైదరాబాద్, ముంబై, ఔరంగాబాద్, గోవా, తిరుపతి, కడప, రాజమండ్రి, నాసిక్, పోరుబందర్ తదితర నగరాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎంఈఐఎల్ గ్రూప్ డైరెక్టర్ కేవీ ప్రదీప్, ఇంటరప్స్ ఇంక్, ఛైర్మన్ పాలెపు లక్ష్మీప్రసాద్ స్పందిస్తూ దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు, సేవలు విస్తరించటానికి విదేశీ పెట్టుబడి నిధులు కేటాయిస్తామన్నారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన వాటా విక్రయ ఒప్పందం త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications