ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఉదయం పలు దేశాల్లో ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ రెడిట్, స్పోటిఫై, ట్విట్చ్, స్టాక్ ఓవర్ ఫ్లో, గిట్ హబ్, గవ్.యూకే, హులు, హెచ్‌బీవో మ్యాక్స్, కోరా, పేపాల్, వీమీయో, షాపిఫై, స్ట్రైప్, న్యూస్ ఔట్‌లెట్స్ సీఎన్ఎన్, ది గార్డియన్, ది న్యూయార్క్ టైమ్స్, బీబీసీ, ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్నెట్ అంతరాయం ఎదుర్కొన్నాయి.
అనేక ప్రముఖ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలు పని చేయకుండా పోయాయి. అయితే, దీనికి అమెరికాకు చెందిన ఫాస్ట్లీ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ప్రొడైవర్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ వెబ్‌సైట్ల ప్రకారం 'మా సిడిఎన్ సేవలతో వాటి పనితీరుపై ఎంత ప్రభావం ఉంది' అనే దానిపై పరిశీలిస్తున్నట్లు ఫాస్ట్లీ పేర్కొంది. ఫాస్ట్లీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో తక్కువ పనితీరును కనబరుస్తున్నాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

రిటైల్ వెబ్‌సైట్ అమెజాన్.కామ్ ఇన్క్ కూడా డౌన్ అయినట్లు వెల్లడించింది. దీనిపై అమెజాన్ ఇప్పటి వరకు స్పందించాల్సి ఉంది. దాదాపు 21వేల రెడిట్ యూజర్లు, సోషల్ మీడియా కస్టమర్లు సమస్య ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డౌన్ డెటెక్టర్.కామ్ ప్రకారం రెండు వేలమంది అమెజాన్‌తో సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఫైనాన్షియల్ టైమ్స్, ది గార్డియన్, ది న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బర్గ్ న్యూస్ కూడా ఇంటర్నెట్ అంతరాయం ఎదుర్కొంది.


Click it and Unblock the Notifications