Haldiram Foods: స్నాక్స్ పరిశ్రమలో పరిచయం అవసరం లేని కంపెనీ హల్దీరామ్. దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో యాజమాన్య హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపటం పెద్ద చర్చకు దారితీసింది.
అమెరికాకు చెందిన అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ బ్లాక్‌స్టోన్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్‌కు చెందిన జీఐసీ కలిసి గత వారం హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేశాయి. దీంతో కంపెనీ విలువ రూ.66,400 కోట్ల నుంచి డీల్ తర్వాత రూ.70,500 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం హల్దీరామ్ దిల్లీ, నాగ్‌పూర్ వ్యాపారంలో వాటా కొనుగోలు గురించి చర్చ జరుగుతోందని సమాచారం. ఇదే సమయంలో బ్లాక్‌స్టోన్ దాని భాగస్వాములతో పాటు, బైన్ క్యాపిటల్ కూడా కంపెనీపై దృష్టి సారిస్తోంది.

ఈ విషయానికి సంబంధించి బెయిన్ క్యాపిటల్ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పలుమార్లు మాట్లాడినప్పటికీ ఇంకా పరిష్కారం రాలేదు. నివేదిక ప్రకారం బ్లాక్‌స్టోన్, దాని భాగస్వాములు కలిసి హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 74 శాతం నుంచి 76 శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఈ ఒప్పందం విజయవంతమైతే భారత కంపెనీలో బ్లాక్‌స్టోన్ అతిపెద్ద వాటా కొనుగోలు అవనుంది. అయితే ఈ వ్యవహారంలో 87 ఏళ్ల నాటి స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటా కొనుగోలుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ మొత్తం డీల్ విజయం హల్దీరామ్ నాగ్‌పూర్, దిల్లీ వ్యాపారాల విజయవంతమైన విలీనంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విలీనానికి ఏప్రిల్‌లో CCI ఆమోదం తెలిపింది. ఈ డీల్ గురించి బ్లాక్‌స్టోన్ ఎంత ఉత్సాహంగా ఉందో, కెనడా ఆసియాలోని తన సహోద్యోగులతో ఫండ్ కంపెనీ కూడా దీని గురించి చర్చించింది.
హల్దీరామ్ కుటుంబం ప్రస్తుతం 3 భాగాలుగా విభజించబడింది. నాగ్‌పూర్ వ్యాపారం హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, దిల్లీ వ్యాపారం హల్దీరామ్ స్నాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విలీనంపై చర్చ జరుగుతోంది. రెండు కంపెనీల విలీనం తర్వాత హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త కంపెనీ ఉనికిలోకి రానుంది. ఈ విలీనం తర్వాత దిల్లీకి చెందిన మనోహర్ అగర్వాల్, మధు సూదన్ అగర్వాల్‌లకు కంపెనీలో 55 శాతం వాటాను కలిగి ఉండనున్నారు. అలాగే నాగ్‌పూర్‌కు చెందిన కమల్‌కిషన్ అగర్వాల్‌కు 45 శాతం వాటా ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications