కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ముందు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు జీఎస్టీ నిధులకు సంబంధించి రెండు ఆప్షన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ సహా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు రెండు ఆప్షన్‌లలో దేనినీ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన జీఎస్టీ సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. దీంతో రాష్ట్రాలకు జీఎస్టీ నిధులపై జీఎస్టీ కౌన్సిల్ భేటీ అవుతోంది.
మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రూ.12,000 కోట్ల వడ్డీ లేని రుణాలను 50 సంవత్సరాల కోసం జారీ చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. అదే సమయంలో వ్యవస్థలో డిమాండును పెంచేందుకు కూడా పలు చర్యలు ప్రకటించారు. ఆత్మనిర్భర్ ఫిస్కల్ డెఫిసిట్ ప్యాకేజీ కింద ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు ఇచ్చే ఈ మొత్తాన్ని మార్చి 31, 2021 లోపు ఖర్చు చేయాలన్నారు. 50 శాతం నిధులు ఇప్పుడు ఇస్తామని, మిగతా సగం నిధుల ఉపయోగం తర్వాత ఇస్తామని తెలిపారు.

ఇందులో రూ.200 కోట్ల చొప్పున 8 ఈశాన్య రాష్ట్రాలకు, రూ.450 కోట్ల చొప్పున ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.7,500 కోట్లు మిగతా రాష్ట్రాలకు అందించనున్నారు. ఇందులో సగం చొప్పున ఇప్పుడే అందిస్తారు. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు ఖర్చు చేసిన అనంతరం ఇస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications