Interarch Building IPO: దేశీయ స్టాక్ మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలు లిస్టింగ్ సమయంలోనే లాభాలతో గర్జిస్తున్నాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లాభాలను అందుకుంటున్నారు. నేడు మార్కెట్లో లిస్ట్ అయిన ఐపీవో సైతం బంపర్ లిస్టింగ్ చూసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇంటరార్క్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు ఒక్కోటి 44.3 శాతం ప్రీమియం ధర రూ.1299 వద్ద బలమైన లిస్టింగ్ నమోదు చేశాయి. అయితే వాస్తవానికి ఐపీవో ఇష్యూ సమయంలో కంపెనీ షేర్ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.900గా ఉంది. గ్రేమార్కెట్లోని అంచనాలకు అనుగుణంగా కంపెనీ లిస్టింగ్ ఉంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.600.29 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.200 కోట్లకు ఫ్రెష్ ఇష్యూ ఉండదా మిగిలిన మెుత్తం ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరిగింది.

కంపెనీ తన ఐపీవోను ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ఆగస్టు 19 నుంచి ఆగస్ట్ 21 వరకు అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.850 నుంచి రూ.900గా ఉంచింది. అలాగే లాట్ పరిమాణాన్ని 16 షేర్లుగా నిర్ణయించింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనేందుకు కనీసం రూ.14,400 పెట్టుబడిగా పెట్టారు. ఈ ఐపీవోలో కంపెనీ తన ఉద్యోగుల కోసం 24,539 షేర్లను రిజర్వు చేసింది. వారికి ఇష్యూ ధర కంటే రూ.85 డిస్కౌంటుకు షేర్లను ఆఫర్ చేసింది. బిడ్డింగ్ చివరి రోజున 93.53 రెట్లు సబ్‌స్క్రిప్షన్ రేటుతో ఇంటరార్క్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఐపీవో అధిక ఆసక్తిని పొందింది. అన్ని కేటగిరీలకు చెందిన ఇన్వెస్టర్లు 43.88 కోట్ల ఈక్విటీ షేర్లను కైవసం చేసుకున్నారు.
కంపెనీ 1983లో స్థాపించబడింది. కంపెనీ దేశంలో టర్న్‌కీ ప్రీ-ఇంజనీరింగ్ స్టీల్ నిర్మాణ పరిష్కారాలను అందిస్తుంది. కంపెనీ డిజైన్, ఇంజినీరింగ్, ఆన్-సైట్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోసం ప్రీ-ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్‌ల ఇన్‌స్టాలేషన్ అండ్ ఎరక్షన్ కోసం ఇంటిగ్రేటెడ్ సౌకర్యాలను అందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దేశంలోని ఇంటిగ్రేటెడ్ PEB ప్లేయర్‌లలో నిర్వహణ ఆదాయంలో 6.1% మార్కెట్ వాటాను కూడా కలిగి ఉంది. కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అప్‌గ్రేడేషన్, సమాచార సాంకేతిక మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం, కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications