సింగపూర్ ఆర్బిట్రేషన్ ప్యానల్ ఆదేశాలపై ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను, ఆస్తులను కొనుగోలు చేసేందుకు దేశీయ చట్టాలకు అనుగుణంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకు వెళ్తామని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తామని రిలయన్స్ తేల్చి చెప్పింది. ఒప్పందం ప్రకారం దఖలుపడిన హక్కులను వినియోగించుకుంటామని స్పష్టం చేసింది.
మరోవైపు, ఆర్బిట్రేషన్ ప్యానల్ ఆదేశాలను సవాల్ చేయనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ సంకేతాలు ఇచ్చింది. ఆర్బిట్రేషన్ ప్యానల్ విచారణ జరుపుతున్న ఒప్పందంలో ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామిగా లేదని వెల్లడించింది. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందాలను కుదుర్చుకున్నామని, ఈ విషయంలో సంబంధిత నిబంధనలు పాటించామని, ఈ ఒప్పందాలు భారత చట్టానికి, ఇండియన్ ఆర్బిట్రేషన్ చట్టానికి లోబడి కుదుర్చుకున్నట్లు తెలిపింది.

ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(RRVL)కు రూ.24,713 కోట్లకు విక్రయించడంపై అమెజాన్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక్కడ అమెజాన్‌కు ఊరట లభించింది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమెజాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఆర్బిట్రేషన్ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications