Buzzing Stock: Q1 ఫలితాలతో దూసుకుపోతున్న స్టాక్.. కంపెనీకి RBI కస్టమర్ కూడా..
Buzzing Stock: దేశంలో ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. జూన్ తో ముగిసిన కాలానికి ఇవి అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా కంపెనీ షేర్ల గురించే. బ్యాంకింగ్ కంపెనీలకు సేవలు అందించే ఈ సంస్థ స్టాక్ క్యూ1 ఫలితాల విడుదలతో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో స్టాక్ ఏకంగా ఇంట్రాడేలో 19 శాతం మేర లాభపడింది. మంచి ఫలితాలతో కంపెనీ షేర్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.

ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా జూన్ త్రైమాసిక ఫలితాల విడుదల తర్వాత కంపెనీ షేర్లలో భారీ ర్యాలీకి కారణమైంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 36 శాతం పెరగటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠంగా రూ.689.15 మార్కును తాకింది. దీంతో కంపెనీపై బెట్టింగ్ పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది.
కంపెనీ త్రైమాసిక పనితీరును గమనిస్తే.. ఆదాయం 19 శాతం పెరిగి రూ.644 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా ఆదాయం కేవలం రూ.540 కోట్లుగా ఉంది. అలాగే ఈ ఏడాది జూన్ క్వార్టర్ నికర లాభం రూ.93 కోట్లు కాగా.. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభాలు రూ.69 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కొత్త డీల్స్ కుదుర్చుకోవటం ఆదాయాల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీ షేర్లలో ఆరు నెలల కిందట పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే వారు దాదాపు 58 శాతం రాబడిని పొందేవారు. పైగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సెంట్రల్ బ్యాంకులు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశవిదేశాలకు చెందిన ప్రైవేటు బ్యాంకులకు అవసరమైన సాఫ్ట్‌వేర్లను ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ తయారు చేస్తుంటుంది. ఆర్బీఐ ఈ సంస్థకు అనేక సంవత్సరాలు నమ్మదగిన కస్టమర్‌గా కొనసాగటం కంపెనీకి మంచి గుర్తింపును తెచ్చిందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications