ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన లేఅప్స్ కథలే నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు అది పోయి 5 ఏళ్లు దాటినా ఇంకా ఉద్యోగ తొలగింపులు మాత్రం ఆగడం లేదు. 2025లో కూడా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. మహమ్మారి తర్వాత నుంచి కంపెనీలు అన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. ఏడాదికేడాది పరిస్థితులు చక్కబడుతూ వచ్చినప్పటికీ ఇంకా ఆర్థిక మాంద్యంలోనే కంపెనీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక ముందు ముందు దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో దిగ్గజ కంపెనీలన్నీ కాస్ట్ కటింగ్ ప్రారంభించాయి.
తాజాగా ప్రముఖ ఐటీ, చిఫ్ తయారీ దిగ్గజం ఇంటెల్ లేఆప్స్ మొదలు పెట్టింది.ఈ నెలలో అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. కంపెనీ విస్తృత స్థాయి ఖర్చు తగ్గింపు ప్రణాళికలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతర్జాతీయంగా కంపెనీ మొత్తం ఉద్యోగులలో సుమారు 20 శాతం వరకు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.

జూలై 15 నుంచి ఉద్యోగ కోతలు అమల్లోకి : ఈ ఉద్యోగ కోతలు ఒరెగాన్ రాష్ట్రంలోని అలోహా, హిల్స్‌బరోలో ఉన్న ఇంటెల్ క్యాంపస్‌లలో జూలై 15 నుండి అమలులోకి రానున్నాయి. సంస్థ దాఖలు చేసిన అధికారిక రిజిస్ట్రీ ఫైలింగ్ ప్రకారం, అనేక విభాగాల్లో ఈ తగ్గింపులు జరగనున్నాయి. ఈ సంవత్సర ఏప్రిల్‌లో ఇంటెల్‌కు కొత్త CEOగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బూ టాన్ సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా Intel కు ఎదురైన సాంకేతిక వెనుకబాటు, మార్కెట్ పోటీ వల్ల కంపెనీ ప్రభావితం అవుతోంది. ముఖ్యంగా TSMC, Nvidia వంటి సంస్థలతో పోటీలో నిలబడటానికి ఇంటెల్ మరింత సమర్థవంతమైన విధానాలను అవలంబించాల్సిన అవసరం ఏర్పడింది.
కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో.. ఈ ఉద్యోగ కోతలు సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లే నిర్ణయంలో భాగంగా తీసుకున్నట్లు తెలిపింది. మేము మా వ్యాపార భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అవసరమైన మార్పులు చేస్తున్నాం. ఈ మార్పుల్లో భాగంగా ఉద్యోగుల పట్ల శ్రద్ధతో, గౌరవంతో వ్యవహరిస్తామని ఇంటెల్ స్పష్టం చేసింది. సంస్థలోని అనవసరమైన క్లిష్టతను తొలగించడం, ఇంజినీర్లను ఎక్కువ స్వాతంత్ర్యంతో పనిచేయనిచ్చే విధానం మాకు మెరుగైన కస్టమర్ సేవలు అందించడానికి, కార్యాచరణలో మెరుగుదల సాధించడానికి సహాయపడుతుందని తెలిపింది.
ఒకప్పుడు సెమీకండక్టర్ల రంగంలో ఆధిపత్యాన్ని సాధించిన ఇంటెల్, గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ-ఆధారిత కంప్యూటింగ్ విభాగంలో ప్రాధాన్యత కోల్పోయింది.Nvidia వంటి సంస్థలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. ఇదే కారణంగా ఇంటెల్ తన వ్యూహాలను సమీక్షించి.. కంపెనీని తిరిగి సెట్ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది.అందులో భాగంగా పెట్టుబడులు ఏఐ-ఆధారిత కంప్యూటింగ్ విభాగంలో పెట్టాలని నిర్ణయించుకుంది.
ఒరెగాన్ ఉద్యోగ కోతలు ఇంటెల్ చేపట్టిన పెద్ద ఎత్తున వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా చెప్పుకోవచ్చు. కంపెనీ ఇప్పటికే అనవసరమైన ప్రాజెక్టులను తగ్గించటం, వ్యాపార విభాగాలను ఏకీకృతం చేయడం వంటి చర్యలు ప్రారంభించింది. దీని ద్వారా వ్యాపార పరంగా స్పష్టమైన దిశగా సాగేందుకు కంపెనీ కృషి చేస్తోంది. ఏదేమైనా ఇంటెల్ కీలకమైన వాణిజ్య నిర్ణయాలతో తన భవిష్యత్తు ను తిరిగి ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ మార్పులు శ్రామికులను, మార్కెట్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేయడం ఖాయం.
More From GoodReturns

Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!

భారత ఐటీ రంగంలో కల్లోలం.. రెండు వైపుల నుంచి తరుముకొస్తున్న రిస్క్.. నిర్మల్ బాంగ్ సంచలన నివేదిక..

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?

14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..

ఐటీ స్టాక్స్ Q4 ఫలితాలు..TCS, ఇన్ఫోసిస్ నుండి HCL టెక్ వరకు.. షేర్లు కొనుగోలుపై బిగ్ అలర్ట్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications