ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో తొలగింపులు ఆగడం లేదు. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక మాంద్యం ఇంకా కంపెనీలను వెంటాడుతోంది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, అలాగే దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య ప్రభావంతో ప్రముఖ కంపెనీలన్నీ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా టాప్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగులను తీసేసాయి. వరుస రౌండ్ల లేఆఫ్ లతో ఉద్యోగులను తీసేస్తున్నాయి టాప్ కంపెనీలు. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోనని ఉద్యోగులు అణుక్షణం భయంతో జాబ్ చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం ఇంటెల్ కూడా ఉద్యోగులను మరోమారు ఇంటికి సాగనంపేందుకు రెడీ అయింది. జూలై మధ్యలో ఉద్యోగాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించడానికి ఇంటెల్ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్ పంపినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల కొత్తగా నియమితులైన CEO లిప్-బు టాన్..మొదటిసారిగా ఈ తొలగింపులను చేపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ది ఒరెగానియన్/ఒరెగాన్‌లైవ్ కథనం ప్రకారం.. ఇంటెల్ కంపెనీ.. జూలై నెల మధ్యలో ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోందని, ఈ ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ తొలగింపులు ఎంతమంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయనే దానిపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. ఏయే ప్రాంతాల్లో ఉద్యోగ తొలగింపులు ఉంటాయనే దానిపై కూడా అధికారిక సమాచారం లేదు. అయితే తొలగింపులు మాత్రం జరుగుతాయని తెలుస్తోంది. కంపెనీ బలోపేతంలో భాగంగానే ఈ తొలగింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. కస్టమర్ల అవసరాలను తీర్చడమే మా లక్ష్యమని ఇంటెల్ కూడా ఓ బహిరంగ ప్రకటనలో తెలిపింది.
లేఆఫ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ Layoffs.fyi గణాంకాల ప్రకారం.. 2025లో 61,220 మందికి పైగా టెక్ ఉద్యోగులు ఇప్పటికే తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీని ప్రభావం 130 ఇతర కంపెనీలలోని ఉద్యోగులపై కూడా పడింది.మే 13న మైక్రోసాఫ్ట్ దాదాపు 6 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. 2023 తర్వాత దాని అతిపెద్ద ఉద్యోగ తొలగింపులు ఇవి. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోనే దాదాపు 2,000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అనేకసార్లు ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం చేపట్టింది గూగుల్. అమెజాన్ కూడా భారీగానే తొలగింపులు చేపట్టింది. అలెక్సా, ఎకో స్మార్ట్ స్పీకర్లు, కిండిల్, దాని అటానమస్ వెహికల్ యూనిట్ జూక్స్ వంటి ఉత్పత్తులను పర్యవేక్షించే దాని డివైసెస్ అండ్ సర్వీసెస్ గ్రూప్‌లోని దాదాపు 100 ఉద్యోగాలను ఇంటికి సాగనంపింది గూగుల్.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications