అమెరికా ప్రభుత్వం ఇంటెల్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌లో దాదాపు 10 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందం కింద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 8.9 బిలియన్ డాలర్లు (సుమారు 74 వేల కోట్లు) పెట్టుబడి కంపెనీలో పెట్టింది. శుక్రవారం (US సమయం ప్రకారం) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇంటెల్ ఇద్దరూ కలిసి ఈ ఒప్పందంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్ పోస్టులో ఈ పెట్టుబడిని ఒక అధ్భుతమైన విజయంగా అభివర్ణించారు. ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన ఐటీ చిప్ మేకర్ దిగ్గజం ఇంటెల్‌లో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం 10 శాతం వాటాను అధికారికంగా కలిగి ఉంది. ఈ షేర్లను అమెరికా కోసం ఎటువంటి ఖర్చు లేకుండానే పొందగలిగామని తెలిపారు. వాటి విలువ ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది అమెరికాకు - ఇంటెల్‌కు అద్భుతమైన ఒప్పందమని పేర్కొన్నారు.
అమెరికా జాతీయ భద్రత, సాంకేతిక ఆధిపత్యం కోసం సెమీకండక్టర్లు ఎంతో ముఖ్యమైనవి. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థలు వంటి రంగాల్లో ఈ చిప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెల్‌లో వాటా సాధించడం ట్రంప్ వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. యుఎస్ ప్రభుత్వం మొత్తం 433.3 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి 20.47 డాలర్ల ధరకు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడికి నిధులు బైడెన్ కాలం నాటి CHIPS & Science Actలో మిగిలిన గ్రాంట్లు, పెంటగాన్ Secure Enclave Program కింద 3.2 బిలియన్ డాలర్ల కేటాయింపు ద్వారా సమకూరాయి.

గణనీయమైన వాటా ఉన్నప్పటికీ.. ఇంటెల్ చేసే వ్యవహారాల్లో అమెరికా ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యక్ష పాత్ర ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ పెట్టుబడికి బోర్డు ప్రాతినిధ్యం లేదా నిర్ణయాధికారం లేవని, కేవలం పెట్టుబడిదారుగా మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుందని ట్రంప్ తెలియజేశారు.
ఇంటెల్ CEO లిప్-బు టాన్ మాట్లాడుతూ.. అమెరికన్ తయారీని బలోపేతం చేయడం, అత్యాధునిక సాంకేతికతలను దేశంలోనే ఉంచడం మా ప్రధాన లక్ష్యంగా చెప్పారు. పెట్టుబడి మాకు మరింత స్థిరత్వాన్ని ఇస్తుందన్నారు.
టాన్ మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత Intel కంపెనీని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగులలో 15 శాతం తగ్గింపు ప్రకటించినప్పటికీ, ఈ ఒప్పందం తర్వాత కంపెనీపై పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది.ఈ ప్రకటన వెలువడిన తర్వాత శుక్రవారం ఇంటెల్ షేర్ ధర 7 శాతం పెరిగింది.పెట్టుబడిదారులు ఈ ఒప్పందాన్ని స్థిరీకరణ శక్తిగా భావిస్తున్నారనే సంకేతంగా దీనిని చెప్పుకోవచ్చు. ఇక జపాన్‌కు చెందిన SoftBank కూడా ఇంటెల్‌లో 2 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని ప్రకటించింన సంగతి విదితమే.
ప్రస్తుతం సెమీకండక్టర్ల రంగంలో ప్రధాన కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తైవాన్ TSMC, దక్షిణ కొరియా Samsung వంటి కంపెనీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇంటెల్ ఒప్పందం అమెరికా టెక్నాలజీ భవిష్యత్తును బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ట్రంప్ టెక్ కంపెనీలతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే Nvidia, AMD కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఈ కంపెనీలు చైనా సంబంధిత విక్రయాల్లో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని అంగీకరించాయి.
More From GoodReturns

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications