ఈ ఏడాదిలోనే అతిపెద్ద లేఆఫ్స్..25 వేల మందిని తొలగిస్తున్న టెక్ దిగ్గజం ఇంటెల్.. కారణమేంటంటే..

ఇంటెల్ సంస్థ నుంచి వెలువడిన తాజా వార్త టెక్ రంగాన్ని కలిపేసింది. 2025 రెండవ త్రైమాసిక ఆదాయ నివేదిక సందర్భంగా, కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం భారీ తొలగింపులు చేపట్టబోతోంది. ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఈ ఏడాది దాదాపు 24,000 మంది ఉద్యోగులను తొలగించబోతోంది. తీసివేస్తున్నఉద్యోగుల సంఖ్య కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు నాలుగో వంతుగా ఉంది. ఇంటెల్ తన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

కంపెనీ కార్యకలాపాలను చిన్నగా, మరింత సమర్థవంతంగా చేయడానికి ఇంటెల్ కంపెనీ తన మొత్తం శ్రామికశక్తిలో ఈ సిబ్బందిని తగ్గిస్తోంది. జర్మనీ, పోలాండ్‌లోని పెద్ద ఫ్యాక్టరీ ప్రాజెక్టులు మూసివేశారు. ఇక్కడ వేలాది కొత్త ఉద్యోగాలు ఆశించడం..అయితే అవి మూతపడటంతో ఉద్యోగులను తొలగించక తప్పలేదు.ఇక్కడి కార్యకలాపాలు కోస్టా రికాకు మారడంతో దాదాపు 2 వేల మంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు.ఇంకా మరికొందరిని వేరే చోటుకు తరలిస్తున్నారు.ఇక్కడ వర్క్ వియత్నాంకు మార్చుతోంది కంపెనీ.

Intel layoffs 2025 Intel job cuts Intel 24000 layoffs Intel factory projects paused Intel chip factory halt Intel restructuring Intel downsizing news semiconductor industry layoffs Intel workforce reduction Intel layoffs news Intel AI shift tech layoffs 2025 Intel plant expansion paused Intel fab project delay 2025 24000 AI

ఇంటెల్ కొత్త CEO లిప్-బు టాన్ మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా ఫ్యాక్టరీని నిర్మించి, ఆపై కస్టమర్లు వస్తారని ఆశిస్తున్నానని నేను నమ్మను అని తెలిపారు. ఇప్పుడు మేము అవసరమైన వాటిని మాత్రమే చేస్తాము. ఇంటెల్ గత కొన్ని సంవత్సరాలలో అనేక ఫ్యాక్టరీ ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేసింది కానీ అమ్మకాలు అంతగా ఆశాజనకంగా లేవు. కంపెనీ 2.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది, ఆదాయం 12.9 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. ఈ సమయంలో కొన్ని మెరుగుదలలు కూడా చేశామన్నారు.

డేటా సెంటర్ యూనిట్ పరంగా చూస్తే క్లౌడ్ మరియు సర్వర్ వ్యాపారంలో కొంత వృద్ధి కనిపించింది. PC చిప్స్ పరంగా డిమాండ్ తగ్గుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే 2025 చివరిలో కాని 2026 ప్రారంభంలో కొత్త ల్యాప్‌టాప్ చిప్‌లు ప్రారంభించబడతాయని కంపెనీ తెలిపింది. ప్రతి ప్రధాన చిప్ డిజైన్‌ను తాను వ్యక్తిగతంగా సమీక్షిస్తానని CEO టాన్ చెప్పారు.

త్వరలో డేటా సెంటర్ విభాగానికి కొత్త నాయకుడు వస్తారని తెలిపారు. AI వ్యాపారం కోసం కొత్త రోడ్‌మ్యాప్ కూడా ప్రవేశపెట్టబడుతుందన్నారు. ఇంటెల్ ఒకప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ చిప్ కంపెనీగా నిలిచింది. అయితే ఇప్పుడు అది AI, చిప్ డిమాండ్ పరంగా వెనుకబడి ఉంది. కంపెనీ ఈ భారీ తొలగింపుల నిర్ణయం ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. కంపెనీ తనను తాను సన్నగా, దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తోంది.

కంపెనీ గత కొంత కాలంగా మార్కెట్లో నష్టాలను చవి చూస్తోంది. ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ రాకతో కంపెనీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. ఒకప్పుడ చిప్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ ఏఐ రాకతో దాన్ని అందుకోలేక సతమతమవుతోంది. ఇతర కంపెనీలు మార్కెట్లో దూసుకుపోతున్నప్పటికీ ఇంటెల్ కంపెనీ మాత్రం ఇంకా వెనకబడిందనే చెప్పుకోవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+