ఆగని లేఆప్స్.. ఇంటెల్ నుంచి మళ్లీ 5 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..

2025 ఏడాది వచ్చినా టెక్ లేఆప్స్ మాత్రం ఆగడం లేదు. ప్రపంచంలోని టాప్ దిగ్గజాలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఏఐ రాకతో ఈ తొలగింపులు మరీ ఎక్కువయ్యాయి. ఏఐ భయం ఉద్యోగులను ఇప్పుడు అణుక్షణం వెంటాడుతోంది. దీనికి తోడు దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలు కంపెనీలను భయపెడుతున్నాయి. ఇందులో భాగంగానే కాస్ట్ కటింగ్ మొదలు పెట్టాయి. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఆరు నెలల కాలంలో లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

తాజాగా ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ దిగ్గజం Intel ఉద్యోగ కోతలు మొదలు పెట్టింది. అమెరికాలో 5 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. కాగా కంపెనీ ఇంతకుముందు ఈ సంఖ్యను 4 వేలు అంచనా వేయగా అది ఇప్పుడు 5 వేలకు చేరింది. తాజా తొలగింపుల లెక్కలు WARN చట్టం కింద దాఖలు చేసిన అప్డేటెడ్ ఫైలింగ్స్ ద్వారా బయటపడ్డాయని Manufacturing Dive రిపోర్ట్ తెలిపింది.

Intel layoffs 2025 Intel job cuts Intel 5 000 layoffs Intel cost-cutting Intel workforce reduction Intel news Tech layoffs 2025 Intel job losses 2025

ఒరెగాన్ లో 2,392 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. (మునుపటి అంచనాకంటే ఇది నాలుగింతలు ఎక్కువ). ఇక కాలిఫోర్నియా: 1,935 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు (మునుపటి సంఖ్యకు రెండింతలు) కోల్పోనున్నారు. మరో రాష్ట్రం అరిజోనాలో 696 మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 5 వేల మందికి పైగా ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. ఒరెగాన్‌లో మాత్రమే ఇంటెల్ స్థానిక సిబ్బందిలో 12% మందిని తగ్గిస్తోంది. అక్కడ Intel కంపెనీ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రైవేట్ యజమాని కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఈ ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చిప్ డిజైన్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీర్లు, అలాగే బిజినెస్ హెడ్‌లు, ఐటీ వైస్ ప్రెసిడెంట్ వంటి సీనియర్లు ఉన్నారు. చిప్ తయారీ విభాగంలోనే ఎక్కువగా కోతలు ఉండనున్నాయి. ఈ విభాగంలో 20% వరకు సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవచ్చని The Oregonian తెలిపింది.కాగా ఇంటెల్ 2024లోనే 15 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోసారి కోతలు పెట్టడం టెక్ రంగంలో కొనసాగుతున్న ఒత్తిడిని కళ్లకు కట్టినట్లు స్పష్టంగా చూపిస్తుంది.

కొత్త CEO లిప్-బూ టాన్ ఆధ్వర్యంలో ఇంటెల్ భారీగా పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. గత కొన్నేళ్లలో సెమీ కండక్టర్ పోటీలో వెనుకబడిన సంస్థను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్గనైజేషన్‌లోని క్లిష్టతను తగ్గించడానికి, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఉద్యోగ కోతలు అవసరమని నొక్కి చెప్పింది. కాగా ప్రభావిత ఉద్యోగులకు 60 రోజుల లేదా నాలుగు వారాల ముందస్తు నోటీసులు ఇవ్వనుంది. తొమ్మిది వారాల జీతం, బెనిఫిట్స్, స్వచ్ఛంద రిటైర్మెంట్ లేదా వాలంటరీ ఎగ్జిట్ ఆప్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

వరుసగా జరుగుతున్న కోతలు టెక్ రంగంలో జరుగుతున్న సవాళ్లను మరోసారి రుజువు చేస్తున్నాయి. పోటీదారులను ఎదుర్కొనేందుకు ఇంటెల్ కొత్త టెక్నాలజీ మోడల్‌ను అవలంబిస్తోంది.అయినప్పటికీ ఉద్యోగులు, స్థానిక ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తప్పదని నిపుణులు అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+