Intel: కొత్త ఏడాది సమీపిస్తున్న తరుణంలో సాధారణంగా పలు కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు, ప్రమోషన్లు ఇస్తుంటాయి. కానీ ఈ అమెరికన్ దిగ్గజ సంస్థ మాత్రం బ్యాడ్ న్యూస్ తో 2023ని ముగించాలని భావించింది. దీంతో సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
ప్రముఖ సెమీకండక్టర్ తయారీదారు ఇంటెల్ తన ఉద్యోగులకు ఐదోసారి షాక్ ఇచ్చింది. అమెరికాలోని ఫోల్సమ్‌లో ఉన్న పరిశోధన మరియు అభివృద్ధి సదుపాయం నుంంచి 235 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

ఈ ఏడాదికి సంబంధించి ఇంటెల్ ఐదవ రౌండ్ ఉద్యోగ కోతలు డిసెంబర్ 31న ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇవి రెండు వారాల పాటు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది. 'సంస్థ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ మరియు ఫంక్షన్ బేస్డ్ సిబ్బందిలో కొందరిని తొలగించాలని నిర్ణయించాం. తద్వారా ఖర్చులను తగ్గించుకుంటూ వృద్ధిని వేగవంతం చేయాలని భావిస్తున్నాం' అని ఇంటెల్ ఓ ప్రకటనలో తెలిపింంది.
గత 4 దఫాలుగా ఫోల్సమ్ క్యాంపస్ నుంచి ఇంటెల్ మొత్తం 549 మందికి ఉద్వాసన పలికింది. ఇక్కడి మొత్తం శ్రామిక శక్తిలో వీరు దాదాపు 10 శాతం కావడం గమనార్హం. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, గ్రాఫిక్ ప్రాసెసర్లు, సాఫ్ట్ వేర్ మరియు చిప్‌సెట్లకు సంబంధించిన R&D కార్యకలాపాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రానున్న రోజుల్లో క్లయింట్ కంప్యూటర్, డేటా సెంటర్ విభాగాల్లో 20 శాతం సిబ్బందిని వదిలించుకోవాలని చూస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications