వీడియో కేవైసీకి బీమా కంపెనీలకు IRDAI అనుమతులు

జీవిత, సాధారణ బీమా కంపెనీలు తమ కస్టమర్లకు వీడియో ఆధారిత గుర్తింపు ప్రక్రియ(VBIP) ద్వారా కేవైసీ నిర్వహించుకోవడానికి ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDAI అనుమతి ఇచ్చింది. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా చేయడానికి కంపెనీ అధికారులకు వెసులుబాటు కల్పించింది. ఇది వినియోగదారులకు కూడా ప్రయోజనకరమే.

ఏదైనా అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా లైవ్ వీబీఐపీతో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చునని IRDAI తలిపింది. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా బీమా కంపెనీలు సరైన తనిఖీలు జరిపిన తర్వాత ఈ వీబీఐటీని యాక్టివేట్ చేయాలని సూచించింది. సైబర్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

 Insurers can conduct video based KYC, says IRDAI

ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో కస్టమర్ సేవలకు ఇబ్బందిలేకుండా బీమా నియంత్రణ సంస్థ చాలా చురుగ్గా వ్యవహరిస్తోందని, IRDAI సూచించిన వీడియో ఆధారిత ఐడెంటిఫికేషన్ ఇబ్బందులను తగ్గిస్తుందని, బీమా రంగంలో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించేందుకు ఇది మరింత ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+