దేశంలో రెండో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రైవేట్ రంగంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్(HDFC Life) ఇన్సూరెన్స్ కు షాక్ తగిలింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్‌పై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) రూ. 2 కోట్ల జరిమానా విధించింది. తమ నోటీసులు అందినప్పటి నుంచి 45 రోజులలోపు జరిమానా చెల్లించాలని IRDAI పేర్కొంది.
పాలసీదారుల ఆసక్తులు, వెబ్ అగ్రిగేటర్లు, బీమా పంపిణీదారులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘించినట్లు రెగ్యులేటర్ వివరించింది.ఔట్‌సోర్సింగ్ ఒప్పందాలలోకి ప్రవేశించే ముందు దాని విక్రేత నిర్వహణ ఒప్పందాలను సమీక్షించాలని పేర్కొంది. అలాగే పాలసీ దారుల పట్ల తగిన శ్రద్ధ వహించాలని జీవిత బీమా సంస్థను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించింది.

ఔట్‌సోర్సింగ్ ఒప్పందాలు, ఇతర ఉల్లంఘనలపై కంపెనీ తప్పనిసరిగా వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రెగ్యులేటర్‌కు సమర్పించాలని పేర్కొంది. సంస్థ బోర్డు ముందు తప్పనిసరిగా ఆర్డర్ ఇవ్వాలి, రెగ్యులేటర్‌కు సమావేశానికి కంపెనీ అప్డేట్ లు సమర్పించాలని స్పష్టం చేసింది.
ఆర్డర్ అందిన 90 రోజులలోపు Irdai ఆదేశాలపై తీసుకున్న చర్యలను వివరించే చర్య తీసుకున్న నివేదికను కంపెనీ తప్పనిసరిగా రెగ్యులేటర్‌కు సమర్పించాని చెప్పింది.
ఈ ఆర్డర్‌తో బీమా సంస్థ విభేదించినట్లైతే, వారు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని కూడా పేర్కొంది. ఈక్విటీ మార్కెట్ల నియంత్రణకు సెబీ ఎలాగా ఉంటుందో.. జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఇతర బీమాలకు రెగ్యులేటరిగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తోంది.


Click it and Unblock the Notifications