Bima ASBA: దేశంలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుదారుల వెసులుబాటు కోసం చెల్లింపులో మార్పులను తీసుకొస్తోంది. ఈ కొత్త రూల్స్ మార్చి 1, 2025 నుంచి మారిపోతున్నాయి.
వివరాల్లోకి వెళితే ఇకపై ఇన్సూరెన్స్ పాలసీదారులు తమ పాలసీ చెల్లింపుల కోసం డబ్బును కొత్తగా తీసుకొస్తున్న Bima ASBA విధానం కింద ఖాతాలో పక్కన పెట్టుకునేందుకు వెసులుబాటును ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ తీసుకొస్తోంది. అయితే దీనిని యూపీఐ చెల్లింపు విధానం ద్వారా అనుసంధానం చేయబడుతోందని వెల్లడైంది. ఈ విధానం ద్వారా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా తీసుకొస్తున్నట్లు ఫిబ్రవరి 18, 2025న IRDAI జారీ చేసిన సర్క్యులర్ వెల్లడించింది.

ఐఆర్డీఏఐ తీసుకొస్తున్న తాజా చొరవతో పాలసీదారులు ప్రీమియం చెల్లింపుల కోసం వారి బ్యాంకు ఖాతాల్లో అవసరమైన నిధులను ముందుగానే బ్లాక్ చేయడానికి అనుమతిస్తుంది. దీనివల్ల ఇమ్మీడియెట్ డెబిట్‌లు లేకుండా సజావుగా లావాదేవీలను నిర్ధారిస్తుందని రెగ్యులేటరీ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ప్రస్తుతం ఇదే విధానాన్ని సెబీ దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీవోలపై బెట్టింగ్ వేసే ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ విధానం కింద అక్కడ ఐపీవో అలాట్మెంట్ జరిగితేనే డబ్బు తీసుకోబడుతుంది లేకపోతే ఆ డబ్బు వినియోగదారుల ఖాతాలోకి తిరిగి వినియోగించుకోవటానికి అందుబాటులోకి వస్తాయి.
Bima-ASBA అంటే ఏమిటి?
రెగ్యులేటరీ సంస్థ కొత్తగా తీసుకొస్తున్న 'Bima-ASBA' ద్వారా కస్టమర్లు తమ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు కోసం వారి బ్యాంకు ఖాతాలోని నిధులను బ్లాక్ చేయవచ్చు. ఇది ఖాతాలో నిధులు అందుబాటులో ఉండేలా చేస్తూ.. చెల్లింపు తేదీ నాటు ట్రాన్సాక్షన్ ఫెయిల్ కాకుండా నిర్థారిస్తుంది. ఈ క్రమంలో లైఫ్, హెల్త్ పాలసీలకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సౌకర్యాన్ని తప్పనిసరిగా అందించాలి. ఇది పాలసీ ల్యాప్స్ కావటం లేదా సకాలంలో చెల్లించాల్సిన పాలసీ మెుత్తం మిస్ కావటం వంటి ప్రమాదాలను నివారిస్తూ పాలసీదారులకు నిరంతరం కవరేజ్ అందేలా చేస్తుంది.
ఈ-కామర్స్ కంపెనీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సేవలను అందించే గిగ్ వర్కర్లకు జూన్ నాటికి ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందుకుంటారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ దీనిపై పని ప్రారంభించన సంగతి తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications