కరోనా పాలసీల కాలపరిమితి పొడిగింపు! ఐఆర్డీఏఐ యోచన
కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల కాలపరిమితిని పెంచే దిశగా ఇన్సురెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జూలై 10వ తేదీన 3.5 నెలలు, 6.5 నెలలు, 9.5 నెలల కాలపరిమితితో బీమా కంపెనీలు ఈ పాలసీలను విక్రయించేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) గతంలో అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు కరోనా ప్రత్యేక పాలసీల ద్వారా 15 లక్షల మందికి పైగా ఈ బీమా సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల కాలపరిమితిని పెంచే దిశగా ఇన్సురెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది. అంతేకాదు, ఈ పాలసీలను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకు రావడమే కాకుండా రెన్యువల్ చేస్తే విషయాన్ని పరిశీలిస్తోంది. కరోనా కవచ్ పాలసీ సమ్ అస్యూర్డ్ రూ.50వేల నుండి రూ.5 లక్షల వరకు ఉంది. కరోనా రక్షక్ ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్. కరోనా కవచ్ పాలసీకి ఎక్కువగా ఆదరణ లభిస్తోంది.

వచ్చే ఏడాది మార్చి చివరి దాకా ఈ పథకాలు అమల్లో ఉంటాయి. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి తర్వాత కూడా ఈ పాలసీల చెల్లుబాటును పొడిగించే అవకాశాలున్నాయని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా చెబుతున్నారు. త్వరలో మార్గదర్శకాలు మార్గదర్శకాలు రానున్నాయని తెలుస్తోంది. కరోనా కవచ్ పాలసీ ప్రతివారం 15 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తోంది. సాధారణ బీమా కంపెనీలు ఈ నెల 10వ తేదీ నాటికి రూ.3,255 కోట్ల 2.07 లక్షల క్లెయిమ్స్ క్లియర్ అయ్యాయి.


Click it and Unblock the Notifications